వినాయక నిమజ్జనం, వైజ్ఞానిక విశేషం.:- తాటికోల పద్మావతి , గుంటూరు

 పూర్వం కలుషిత జలాన్ని శుభ్రపరిచేందుకు ఇప్పటి మాదిరి పద్ధతులు సౌకర్యాలు లేవు. నిమజ్జనానికి చెరువులు, బావులు, నదులే ఆధారాలు. మరి ఇవి కలుషితమైతే ఎలా?.
ఎందుకు జవాబు గణేశా నిమజ్జనం. వినాయకుని పూజలు 21 ఆకుల ఉపయోగిస్తారు. ఇవన్నీ నీ ఓషధీ గుణాలు కలిగి ఉన్నవి. గణపతి విగ్రహంతో పాటు పూజా పత్రిని కూడా నిమజ్జనం చేస్తారు. అందువల్ల ఆ 21 పత్రాలలో ఉండే ఓషధీ గుణాలు ఆ నీళ్లలోని కాలుష్యాన్ని వ్యాధికారక క్రిములను పోగొట్టి నీటిని శుద్ధి చేస్తాయి.
గణపతికి గరికపోచలంటే చాలా ఇష్టం. దీన్ని సంస్కృతంలో దూర్వా అంటారు. ఇది చెడ్డ కలలను రాకుండా చేస్తుంది. వినాయక పూజ నెపం తో ప్రజలకు ఆరోగ్యాన్ని చేకూర్చడం అనే పరమ ప్రయోజనము ఉన్నది. గణపతి పూజలో ఉపయోగించే 21 పత్రాలు తమ స్పర్శవల్ల వాసన వల్ల అనేక వ్యాధుల్ని పోగొట్టి, వాతావరణ జల కాలుష్యం తొలగించి మానవులకు ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి.
భాద్రపద మాసం వర్షరుతువు కనుక వానివల్ల, బురద వల్ల కలుషిత జలం వల్ల, చిత్తడి వల్ల ఎన్నో రోగాలు వస్తాయి. ఈ పూజ నెపంతో 21 పత్రాల వాడకం వల్ల ఈ ప్రకృతి కాలుష్యం నుండి నివారణ పొందడం గొప్ప ప్రయోజనం కదా.
విశేషంగా గరిక వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని విజ్ఞాన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కొన్ని దేశాల్లో గరికతో రొట్టెలు చేసి, పౌష్టికాహారంగా స్వీకరించే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. హోమియో వైద్యంలో గరికకు చాలా ఉపయోగం ఉంది

కామెంట్‌లు