11.ప్రేమ!
అంతర్నేత్రం!
దానికెంతో ఆత్రం!
అది బతుకు సూత్రం!
నిలవనీయదు ఏమాత్రం!
12.ప్రేమ!
నిలిచే శ్వాస!
వీడని ఆశ!
వెన్ను పూస!
ప్రాణస్పర్శ!
13.ప్రేమ!
వింత మోహం!
సాంతం సమ్మోహనం!
జగత్ జన్నకారణం!
జీవనతరణం!
14.ప్రేమ!
అందాల హరివిల్లు!
హాయి నిచ్చే జల్లు!
అదో పూలతేరు!
ఆనందాల ఊరు చేరు!
15.ప్రేమ!
అద్భుత శక్తి!
దేహంపై రక్తి!
దైవం పై భక్తి!
అంతిమంగా ముక్తి!
(కొనసాగింపు)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి