:మానసిక అశాంతి :--భరద్వాజరావినూతల (RB)కొత్తపట్నం ప్రకాశం జిల్లా 986620379

 కలహం 
ఆవేశానికి మూలం 
తొందరపాటుకు ప్రతిఫలం 
కలహానికి అవసరంలేదు కారణాలు 
చిన్నమాటపట్టింపుతో వస్తాయి రణాలు -
పెదవిదాటితే పృధివిదాటుతుంది 
శరం గుచ్చుకుంటే చేయించుకోవచ్చు వైద్యం 
మాటగుచ్చుకుంటే మందులేదు 
ఈర్షా ద్వేషాలు దీనికి తోబుట్టువులు 
అసూయతో పెరుగుతుంది ద్వేషం 
అవుతుంది కలహానికి కారణం 
అలక పాడుతుంది వంత 
రాముడొమిని అడవులకు పంపినా 
పారిజాతం తెప్పించినా కారణం ఇదే కదా 
కన్నీరుఎరుగని కళ్ళు 
కలహం ఎరుగని మనుషులు ఉండరు 
 -

కామెంట్‌లు