నా నోము ఫల మీవ్వవే గౌరమ్మ( గౌరమ్మ పాటలు) సంగ్రహం: రసస్రవంతి & కావ్యసుధ 9247313488
 రుద్రాక్ష చెట్టల్ల ఆటచిలుకల్లారా పాటచిలుకల్లారా
కలికిచిలుకల్లారా కొలికి చిలుకుల్లారా కందువ్వ గువ్వలు
నీ నోము నీకిత్తునే గౌరమ్మ
నా నోము ఫలమివ్వవే....
కట్లాయిచెట్లల్ల ఆటచిలుకల్లారా పాటచిలుకల్లారా
కలికిచిలుకల్లారా కొలికిచిలుకుల్లారా కందువ్వ గువ్వలు
నీ నోము నీకిత్తునే గౌరమ్మ
నా నోము ఫలమివ్వవే.....
గోరంట్లచెట్లల్ల ఆటచిలుకల్లారా పాటచిలుకల్లారా
కలికిచిలుకల్లారా కొలికిచిలకల్లారా
కందువ్వ గువ్వలు
నీ నోము నీకిత్తునే గౌరమ్మ
నా నోము  ఫల మివ్వవే...
తంగేడుచెట్లల్ల ఆటచిలుకల్లారా పాటచిలుకల్లారా
కలికి చిలుకల్లారా కొలికి చిలుకల్లారా కందువ్వ గువ్వలు
నీ నోము నీకిత్తునే గౌరమ్మ -
నా నోము ఫలమివ్వవే.....

: గౌరమ్మ పాటలు -- 2
జొన్నల పుట్టిన గౌరీ 
జొన్నల్ల పెరిగిన గౌరీ
అన్న లేసిన పొన్నలకింద
నేను వేసిన నిమ్మల కింద
చల్లంగుండు సంపతి గౌరమ్మా 
వడ్లల్ల పుట్టిన గౌరీ
వడ్లల్ల పెరిగిన గౌరీ
అన్న లేసిన పొన్నలకింద --                          
నేను వేసిన నిమ్మల కింద
చల్లంగుండు సంపతి గౌరమ్మా 
కందుల్ల పుట్టిన గౌరి -
కందుల్లో పెరిగిన గౌరీ
అన్న లేసిన పొన్నలకింద --
నేను వేసిన నిమ్మల కింద
చల్లంగుండు సంపతి గౌరమ్మా 
పెసళ్ళ పుట్టిన గౌరీ --
పెసళ్ళ పెరిగిన గౌరీ
అన్న లేసిన  పొన్నల కింద...                      
 నేను వేసిన నిమ్మల కింద
చల్లగుండు సంపతి గౌరమ్మా 
మినుముల్ల పుట్టిన గౌరీ --                          
మినుముల్ల పెరిగిన గౌరీ
అన్న లేసిన పొన్నల కింద
చల్లంగుండు సంపతి గౌరమ్మా 
అనుముల్లో పుట్టిన గౌరీ...                           
అనుముల్లో  పెరిగిన గౌరీ
అన్న లేసిన పొన్నల కింద
సల్లంగుండు సంపతి గౌరమ్మా
జనుముల్లో పుట్టిన గౌరీ --                          
  జనముల్లో పెరిగిన గౌరీ
అన్న లేసిన పొన్నల కింద                                                     
నేను వేసిన నిమ్మల కింద
చల్లగుండూ సంపత్తి గౌరమ్మా *
          .......   .......
( బతుకమ్మ పండుగ లందు  వాయనము లిచ్చు కొన్నప్పుడు ఈ పాటలు పాడుకుంటారు.)

కామెంట్‌లు