చిత్రానికి పద్యాలు:-మమత ఐలహైదరాబాద్9247593432

 ఉ.
చెంబున కొప్పుబెట్టుకొని చెంతనె చక్కని గాలి పంకయున్ తో
దంబము తోడ మంచమున తా కొన గోరును దీయుచుండె
 సౌ ఖ్యంబుగతిష్టవేసి;చెవి కమ్మలు సొంపును గూర్చుదుస్తులన్
రంబకు మిన్నయై యువతి లాస్యముగా కను విందు జేసెనే
ఉ.
గాలికి పంకబెట్ట చెవి కమ్ముల లోలకులూగతోచెనే
కేలిగ నాడుచుండ తల కేశములాపగ పిన్నుబెట్టెనే
మాలగ చెంబునెంచుకొని మంచిగ దూర్చెను కొప్పునందులో
తాలని వేడిపోవగనె తాపిగ గోర్లను తీయుచుండెనే
కామెంట్‌లు