బతుకమ్మ : తొగర్ల సురేష్కవి,రచయిత ఫ్రెండ్లీ పోలీస్ నిజామాబాద్ జిల్లా.

 ఏడు రంగుల 
ఇంద్రధనుస్సును 
పోలిన పూల చెండు
మన బతుకమ్మ
ఏడుకొండలవలే 
కమ నియం
హరిత వన దృశ్యం 
మన బతుకమ్మ
 అచ్చు తెలుగు
తెలంగాణ భాష 
జానపద జావలీల
అక్షరాంజలి
మన బతుకమ్మ
గత చరిత్రకు
నిలువు ఠద్ధo
మన బతుకమ్మ
భవిష్యత్తుకు 
ఆనవాలు 
మన బతుకమ్మ
తెలంగాణ చరిత్రను
ప్రపంచానికి చాటిన ఘనత
మన బతుకమ్మ
తొమ్మిది రోజుల పండుగ
ఆడవారికి కనుల పండుగ
పట్టు చీర కట్టుకొని 
ఆట ఆడే పండుగ 
మన బతుకమ్మ
కన్నెలందరు 
సందడి చెయ్యగా 
చిన్నారులందరు 
గంతులు వేయగా 
ముత్తుయదువులందరు 
పాటలు పాడగా
సద్దుల బతుకమ్మను
తలపై మొయంగా 
వడివడిగా అడుగులు వేస్తూ
ఉరి చెరువుకు పయనమయ్యారు
నువ్వుల బెల్లము ఉండలు
నోటిని తీపి చెయ్యగా 
పోయిరావమ్మ 
మళ్ళీ ఏడాదికి 
తిరిగి రావమ్మ
 

కామెంట్‌లు