మాతృభాష కవిత; -ప్రతాప్ కౌటిళ్యా,, సునీత పాలెం, నాగర్ కర్నూలు జిల్లా
అమ్మ మాటలు ముత్యాల మూటలు
అమ్మ భాష బంగారు రాశి
ఆటపాటల మాట అమ్మ మాట
పలక బలపం నుదుటి రాత మాతృభాష!!?

నీటి పై గీతలు
తాతముత్తాతల గీతాలు
రాతి పై గీతలు
అమ్మ పాడిన జోల పాటలు!!?

ఎన్ని వేషాలు అయినా వేయవచ్చు
కానీ అమ్మ భాష మాత్రం ఒక్కటే!!?

అమ్మా _భాషా జ్ఞానాన్నే కాదు
విజ్ఞానాన్ని కూడా ఇస్తుంది!!
భాషా జ్ఞానం లేకుంటే
విజ్ఞానం కూడా లేదు!!?

మాతృభాష
ప్రతి వ్యక్తికి ఒక తత్వం లాంటిది
మాతృభాష
ప్రతి వ్యక్తికి సంపూర్ణ వ్యక్తిత్వం లాంటిదీ!!?

పంచేంద్రియాలను
స్పర్శ ద్వారా పరిచయం చేసింది అమ్మ!!
పంచభూతాలను
పంచేంద్రియాల ద్వారా పరిచయం చేసింది
మాతృభాష!!?

Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏❤️🙏
8309529273, Sunita teacher

కామెంట్‌లు