*పరోపకార పద్ధతి*
చంపకమాల:
*క్షీరము మున్న నీటి కొసఁగెన్ స్వగుణంబులు దన్నుఁజేరుటన్*
*క్షీరము దప్త మౌట గని చిచ్చురికెన్ వెతచే జలంబు, దు*
*ర్వారసుహృద్విపత్తిఁగని వహ్నిఁజొరంజనె దుగ్ధ, మంతలో*
*నీరముఁగూడి శాంతి మగు, నిల్చు మహాత్ములమైత్రి యీగతిన్*
*తా:*
పాలతో కలసిన నీటికి తన గుణమును ఇస్తాయి పాలు. అవే పాలను కుంపటి మీద పెట్టి వేడిచేస్తే, పాలకంటే ముందు నీరు నిప్పులోకి పరుగెడుతాయి. తనతో కలసిన నీరు నిప్పులలో పడిపోతోంది అని పాలు కూడా నీటితో పాటు నిప్పులలో పడడానికి పరుగెడతాయి. అప్పుడు, పాలు చల్లని నీటితో చేరి నిప్పులో దూకే తమ ఆలోచనను మానుకుంటాయి. పరోపకార గుణము వున్న మంచివారితో స్నేహం కూడా ఈ విధంగా నే వుంటుంది......... అని *"ఏనుగు లక్ష్మణకవి"* చెపుతున్నారు.
*భావం:*
*"ఆ జంటను చూడండి, పాలూ నీళ్ళలా ఎంత చక్కగా కలసి పోయారో" అని మన పెద్దవారు అనడం మనం చాలా సార్లు వినే వున్నాము. "సీతా రాములలా, పాలూ నీరులా" వుండడము అంటే, ఒకరిని ఒకరు అర్ధం చేసుకుని, ఇద్దరూ కూడా ఎదుటి వారి కష్ట సుఖాలను తమవిగా అనుకుని, ఒకరి ఉన్నతికి మరొకరు తోడుపడుతూ కలసి మెలసి వుంటుంటే అప్పుడు మనకు తెలియకుండానే, "ఆ జంట ఎంత ముచ్చటగా జీవితం సాగిస్తోందో" అని అనుకుంటాము. ఈ విధంగా అనుకున్నారు కాబట్టే, ఒక కర్ణుడు, పాండవ శ్రీకృష్ణులు, రామ సుగ్రీవులు, రామ హనుమలు, శ్రీకృష్ణ కుచేలురూ మనకు మంచి ఉత్తమ పురుషుల దారిలో వెళ్ళడానికి చుక్కానులుగా నిలిచారు. ఇటువంటి మంచి దారిలో ప్రయాణం చేయడానికి దారిచూపే సద్గురువు అనే పరమ పురుషుని మనకందరకు పరిచయం చేయమని ఆ లక్ష్మీవల్లభుని వేడుకుంటూ ...... .*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి