*పరోపకార పద్ధతి*
తేటగీతి:
*తనిసిరే వేల్పు లుదధిర త్నములచేత?*
*వెరచిరే ఘోరకాకోల విషముచేత?*
*విడిచిరే యత్న మమృతంబు వొడముదనుక?*
*నిశ్చితార్ధంబు వదలరు నిపుణమతులు.*
*తా:*
దేవతలు సముద్ర మధనము చేసేటప్పుడు మొదటగా సముద్రము నుండి రత్నములు దొరకగానే తృప్తి పడలేదు. తరువాత కాలకూట విషము వచ్చింది, అయినా భయపడలేదు. చిట్ట చివరకు, అమృతము దొరికే దాకా దేవతలు వారి ప్రయత్నం మానలేదు. తెలివితో పనిచేయ గలిగిన వారు ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురైనా వారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే దాకా పనిచేయడం ఆపరు............ అని *"ఏనుగు లక్ష్మణకవి"* చెపుతున్నారు.
*భావం:*
*మహాభారతం లో ఏకలవ్యుడు. ద్రోణాచార్యుని వద్ద శిష్యరికం చేసి ఒక మంచి విలుకాడుగా అవ్వాలి అనుకుంటాడు. కుదరదు అంటాడు, ద్రోణుడు. ఏకలవ్యడు తన గురువు విగ్రహాన్ని తయారు చేసుకుని, ఆ విగ్రహమే పాఠం చెప్తోంది అని నమ్మి విద్య నేర్చుకుంటుంన్నాడు. పాండవులకు విద్య నేర్పే క్రమంలో, ఏకలవ్యుడు తన ప్రియ శిష్యుడు అర్జునుని మించి పోతాడు అని అర్థం చేసుకుని, ఏకలవ్యుని బొటన వేలు గురుదక్షిణ గా తీసుకుంటాడు, ద్రోణుడు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏకలవ్యుడు తన లక్ష్యాన్ని సాధించే వరకూ, తగ్గలేదు. ఇటువంటి స్థిరమైన లక్షణాలను మనకందరకు అనుగ్రహించాలని అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని కోరుకుంటూ...... .*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి