కథలోకి వెళితే రాహుల్ కుసుమ ఎడబాటుతో నిరామయానికి గురియై ఆమె జాడ కోసం చాలా వెతికాడు కానీ కుసుమ జాడ తెలిసి రాలేదు
గీతను కలిసాడు గీత పరిస్తితి ఘోరంగా మారింది
తను ప్రాణ స్నేహితురాలు తనకు కూడా ఇసుమంత
జాడ తెలియనీయక ఒంటరిగా తోడబుట్టిన వారిని
తీసుకుని వెళ్ళిపోయింది వెళ్ళేముందు నాకు ఒక్క
మాట కూడా చెప్పలేదు నేను అంత కాని దానిని అయ్యానా దాని ప్రతీ అడుగు నాకు చెప్పి వేసేది
అలాంటిది మేము అండగా వుండక పోయేవారమా
మా అమ్మా నాన్నలకు కుసుమ అంటే ఎంతో ప్రేమ
దానిని కూడా నాతో సమానంగా చూసేవారు...!!
ఇవన్నీ మరిచి పోయి ఒక్కసారిగా తాను ఒంటరిగా
ప్రయాణం చేయాలని ఎందుకు నిర్ణయం
తీసుకుంటుందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు
కానీ దాని మనసులో ఏదో ఆలోచన లేకపోతే ఇలా చేయదు బహుశా అది ఎక్కడికి వెళుతుందో నాకు
చెపితే నా ద్వారా మీకు తెలుస్తుందని మిమ్మల్ని
తాను పెళ్ళి చేసుకుని వేళ్ళిపోతే చెల్లెలు తమ్ముడు
పరిస్తితి ఏమిటి అనుకుందేమో అని రాహుల్ తో
అనేసరికి రాహుల్ ఒక్కసారి ఉద్వేగానికి గురి అయినాడు నిజమే గీత గారు ఎంతో తెలివి గలది
ఇంత ఫూలీష్ గా ఆలోచిస్తుందని అనుకోలేదు...!!
తను తల్లి తండ్రి కి అలా అయితే నేను చూస్తూ
వూరుకుంటానా తనవాళ్ళని వదిలేస్తానా మా అమ్మ
ఎంత బాధ పడుతోందో నాకు ఒక్క మాట చెపితే
మా కుటుంబం మొత్తం తనకు అండగా నిలిచే
వాళ్ళం తన సమస్యలు తీరే వరకు నేను ఆగే
వాడినే కదా అందునా నాకు జాబ్ కూడా వచ్చిందని
తెలుసు కదా ఇంతేనా కుసుమ నన్ను అర్దం
చేసుకుంది వాళ్ళను తీసుకుని ఎక్కడికి వెళ్ళిందో
ఎన్ని బాధలు పడుతోందో ఏమో నామనసంతా
తను ఆలోచనలతో నిండిపోయింది తను నాకు
కనిపించేదాకా నామనసు కు విశ్రాంతి లేదు.....!!
ఎప్పటికయినా తనతోనే నాజీవితం అంతదాకా
నేను ఒంటరిగానే పయనిస్తా నాకు తోడూ నీడ
నాశ్వాసా నాఊపిరీ నా సుఖ సంతోషాలూ నాజీవన సహచరి సర్వస్వం నా కుసుమనే ఆమె లేని
జీవితం నేను ఊహించలేదు గీత గారూ అని
గుండెల్లో గూడు కట్టుకున్న బాధనంతా బయటికి
వెళ్ళి గక్కిన రాహుల్ ను చూసి గీత కళ్ళు చెమర్చాయి గీత గారూ కుసుమ కాస్త కుదుటపడి
దేవుడు బుద్ది పుట్టించి మీకు లెటర్ రాస్తే నాకు
కబురు చేయండి ప్లీజ్ అని వేడుకున్నాడు రాహుల్
రాహుల్ గారూ మీరు దిగులు పడకండి కుసుమ కు
మీరంటే చెప్పలేని ప్రేమ తాత్కాలికంగా మీనుండి
దూరమైనా మిమ్మల్ని వెతుక్కుంటూ తప్పక
వస్తుంది కాలమే బాధలను మరిపిస్తుంది అంటారు
మీరు దానికోసం బాధ పడుతూ ఉద్యోగ ధర్మాన్ని
విస్మరించకండి మీరు నాకు తోడబుట్టిన వారితో
సమానం రేపో మాపో కుసుమ వస్తే ఆమెను కాలు
కిందపెట్టకుండా చూసుకోవాలంటే మీ ఉద్యోగ ధర్మం
సక్రమంగా చూసుకోవాలి అని గీత అనేసరికి
తను వస్తే పువ్వులు పై నడిపిస్తా నా అనురాగ
దేవతని అని అన్నాడు రాహుల్ ...!ఛ కుసుమ ఎంత
అనాలోచితమైన పని చేసింది కనులముందు
అదృష్టాన్ని కాల తన్నుకుని వెళ్ళింది రాహుల్
ఎంత మంచివాడు అని మనసులో బాధ పడింది...!!
రాహుల్ జాబ్ చేసుకుంటూ జీవితంపై నిర్లిప్తంగా
ఒక రకమైన విరక్తికి గురియై యాంత్రికంగా జీవనం
సాగిస్తున్నాడు విందులు వినోదాలకూ దూరంగా
ఎప్పుడూ కుసుమ ద్యాసలోనే గడిపే రాహుల్ ను
చూసిన తల్లి తండ్రులు బాధ పడని రోజులేదు
వేరే సంబంధం చూస్తాము అని రాహుల్ తో అనే
దైర్యం లేదు దేవుడా కుసుమను అన్నా చూపించు
లేకపోతే రాహుల్ మనసైనా మార్చు మావల్ల
కావటంలేదు కొడుకుకు పెళ్ళి చేసి పిల్లా పాపలతో
కళకళలాడాల్సిన ఇల్లు బోసిగా చూడాల్సివస్తోంది అనే అమ్మానాన్నా మాటలు కూడా చెవికి
సోకనంత దైన్యం లోకి వెళుతున్నాడు రోజు రోజుకూ?
(సశేషం)....................!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి