సమ్మోహనాలు ;విజయసారథి (561-565);--ఎం. వి. ఉమాదేవి
జయ విజయ సారథీ 
సారథి మనోరథీ 
మనోరథ భావనలు నడిపించు శ్రీ కృష్ణ ! 

దాయాది పోరులో 
పోరున ధర్మంలో 
ధర్మమున నిలుచుటే నీ పథము శ్రీ కృష్ణ !

కౌరవ సంతానము 
సంతానపు కుటిలము 
కుటిలత్వమణుచుటకు సాయముగ శ్రీ కృష్ణ !

డిల్లపడి యర్జునుడు 
అర్జున రణ విముఖుడు 
విముఖునికి కర్తవ్య బోధనము శ్రీ కృష్ణ !

మహాద్భుత గీతనే 
గీత బోధించెనే 
బోధలో కర్మయోగముకలిసె శ్రీ కృష్ణ !!

కామెంట్‌లు