అన్నదమ్ములు (మణిపూసలు):-చైతన్య, 7013264464

 1. 
తల్లి వృక్షముకు పుట్టిన 
తోబుట్టువులై ఎదిగిన 
ఆత్మీయ గంధమే 
అన్నదమ్ములు ఇలలోన
2.
కష్టసుఖాల పయనము 
రామలక్ష్మణా బంధము 
కుటుంబ గౌరవాలకు 
గురుతరబాధ్యతనిలయము
3.
విల్లులాంటి ధైర్యము 
కష్టాలలోన  శరము   
ఆడబిడ్డల మనమున 
తన తండ్రి తోటి సమము 
4.
కాసులతో కొనలేనిది 
ఆదరణే కలిగినది 
అభిమానం నింపుకొని 
కలకాల ముండేది 
5.
పేగు బంధమొకటిగ
ప్రేమంతా ఒకటేగ
చిన్ననాటి చిలిపి తనం 
నిలిచిపోవు దృఢముగ
6.
ఆత్మీయ ప్రాకారము 
ఒకే వీణా నాదము 
అన్నదమ్ములిలలోన 
ఆలయాన గోపురము. 

కామెంట్‌లు