పికాసో మంచితనం;-కంచనపల్లి వేంకట కృష్ణారావు--9348611445
  పికాసో చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంత గొప్ప పేరుందో తెలిసిందే కదా! ఆయన చిత్రాలు మక్కీకి మక్కీ కాపీ కొట్టే వారు కొందరు కళా తస్కరణ చిత్రకారులు ఇంకా ఆయన సంతకాన్ని కూడా అచ్చం ఆయన చేసినట్టే దింపేసే వారు!
      ఆయన మిత్రులు కొందరు  "నీ చిత్రకళకు దొంగ నకళ్ళు ఏర్పడుతున్నాయి...మరి వారి మీద కేసు పెట్టవచ్చు కదా!" అని అడిగారు.
     " కాపీ కొట్టిన వారికి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో,కనీసం కాపీ కొట్టి అయినా వారు బతకాలి కదా! నా చిత్రాలు ఆ విధంగా వారి కడుపు నింపుతుండొచ్చు,అవి అసలైనవా నకిలీవా అని పరిశోధించే వారికి కూడా అవి తిండిపెడుతున్నాయి!, నాకు తెలియకుండానే నా చిత్రాలు ఎంతో మందికి తిండి పెడుతున్నందుకు సంతోషిస్తున్నాను" అని ఆధ్యాత్మికంగా వారికి చెప్పాడట పికాసో! ఎంతైనా పికాసో గొప్పవాడు, ఆయనది దొడ్డ బుద్ది.
       ఆయన చిత్రాలను చైనా చిత్రకారులు కాపీ కొడుతూనే ఉన్నారు! అవి అసలువా నకిలీవా అని తెలుసుకోవడం కూడా కష్టమే!
              *********

కామెంట్‌లు