31). ఇంద్రధనస్సు చూడు
సప్త వర్ణముల జోడు
కళకళ లాడుతున్నది
ఆ చల్లనయ్య తోడు !
32). ఆకాశంలో చుక్కలు
వేస్తావా ఇక పక్కలు
వచ్చేను సుఆలోచనలు
మెరిసే నాలో రుక్కులు. !
34). మేఘాల గర్జనలు విను
పర్జన్యుని నీవిక కను
భయం చెందవద్దు నీవు
వింటున్నావా ఓ భాను !
35). సిరి మువ్వల చప్పుడు
వింటున్నాను ఇప్పుడు
తెచ్చినవారు ఎవరు?
చెప్పేది ఇక ఎప్పుడు ?
36) రామ చిలక మాటలు
వినుట ఎన్ని పూటలు?
చెప్పు నీవు రామా
తిరుగుతున్న తోటలు !
37). చిలకపలుకులు తీయన
వింటున్నావా నాయన
నీ ముందున్నది చిలక
చూడు నీవిక రయాన !
38). ఉదయించే సూర్యుడు
మా ఇంటిలో దేవుడు
కరుణిస్తాడు మమ్ములను
మేం కొలిచే దినకరుడు !
39). వేదం మా నినాదం
కాదు మరి వివాదం
అంతా ఆదరిస్తారు
వారికి కలుగు మోదం !
40). బీదలను ఆదరించు
సాయం ఇక అందించు
పొందుతారు సంబరం
నిన్నందరూ దీవించు !
41) పచ్చని చెట్లను పెంచు
అవి ఫలముల నందించు
గైకొను వాటి రక్షణ
అప్పుడు అవి దీవించు!
42). మందు తాగు అలవాటు
చేయకు ఆ పొరపాటు
చెడి పోగు ఆరోగ్యం
మందుతో కలుగు చేటు
43). కష్టే ఫలియని తెలుసుకో
ఇష్టంతో ఇక మసలుకో
కష్టపడితేనే సుఖం
అని తెలుసుకొని నడుచుకో !
44). కురిసే అకాల వర్షాలు
కలిగిస్తాయిలే నష్టాలు
పంటలు వరదల పాలగు
మిగులు ప్రజలకు కష్టాలు!
45). అన్యాయానికి తలపడకు
న్యాయ ఫథాన్ని విడువకు
న్యాయ విలువల బోధించు
నీ పట్టును ఇక మరువకు !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి