కరిమింగిన వెలగపండు
కదలీ ఫలంతోఅవి రెండు
కరములతో గైకొని తెండు
కమ్మని రుచిగా అవి ఉండు !
కనులు కనులు కలిసెను
కలలో నా చెలి మెరిసెను
కమలా ఫలములు తెచ్చేను
కనుసైగతో నాకు ఇచ్చేను !
కథ చెపుతా రారా కన్నా
కదిలివచ్చి వినరా చిన్నా
కమ్మని కథలెన్నో వినిపిస్తా
కథల పుస్తకాలు కొనియిస్తా !
కలల రాణి నా కలలోకి వచ్చింది
కనుసైగలతో నన్ను తాను గిచ్చింది
కవితలు విని తానెంతో మెచ్చింది
కమలా ఫలములు తినమని ఇచ్చింది!
కవలలు మీరే మాకు ముద్దు
కలత మీరు ఇక చంద వద్దు
కథలను మీకు నేను వినిపిస్తా
కమ్మని పండ్లను కూడాతినిపిస్తా !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి