జీవితంలో కూడు, గుడ్డ, నీడ లేకుండా జీవి జీవించలేడు అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. కూడు లేకపోతే శరీరానికి నీరసం వస్తుంది. కొంచెం తిన్నా అది ప్రాణాన్ని నిలబెడుతుంది. నీడ లేని వాళ్ళు ఏ చెట్టు కిందో ప్రుట్ట ప్రక్కనో కూర్చుంటారు.గుడ్డ లేని వారు మానాన్ని కాపాడుకోవడానికి గొచినైనా పెట్టుకుంటారు. ఈ మూడింటి కన్నా మనకు కావలసింది ప్రాణాన్ని నిలబెట్టేది, అయిదు నిముషాలు లేకపోయినా భౌతికంగా మనల్ని దూరం చేసేది గాలి. అది లేకుంటే మనిషికి ప్రాణం లేదు. భోజనం లేకుండా రోజుల తరబడి ఉపవాసం ఉండొచ్చు కానీ గాలి లేకుండా బ్రతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. గాలి తర్వాత మనకు కావలసింది జలం. నీరు లేకపోయినా ప్రాణానికి హాని, నీరు ఎక్కువైనా ప్రాణానికి ముప్పు కనుక నీరు సరిపడా ఉండాలి. దీని కథంతారైతుకు తెలుస్తోంది.
తొలకరి చిరుజల్లులు పడకపోతే నేల బీటలు వారి ఎందుకూ పనికి రాకుండా పోతుంది కొంచెం వర్షం వస్తే దుక్కి దున్ని పంట పండించి భారతదేశానికి భోజనాన్ని ఇస్తాడు రైతు. పంట పండి పుష్కలంగా ఉండి కోత కోసిన సమయంలో అనుకోకుండా భారీ వర్షాలు పడితే ఆ కోసిన వరి మొత్తం తడిసిపోయి ఎందుకూ పనికి రాకుండా పోతుంది అందుకే అతివృష్టి అనావృష్టి అనే పేరు వచ్చింది. సమయానికి ఆదుకొనే వర్షాన్ని అనావృష్టి అంటాము. ఎక్కువ వర్షం పడి పండిన పంట మొత్తం పాడైపోతే దానిని అతివృష్టి అంటాం. అతి "సర్వత్ర వర్జయేత్" అన్నది పెద్దల సూక్తి ఇందుకు ఉదాహరణ.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి