లవణమన్నము;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి.94928 11322
 జీవి తల్లి గర్భంలో అణువుగా ప్రవేశించి 9 నెలలు పెరిగి పెద్దదయి  మానవాకృతిగా రూపుదిద్దుకుంటుంది. మన వాళ్లు దశావతారాల గురించి మాట్లాడుతూ మత్స్య కూర్మ వరాహ అంటూ పది అవతారాలు అని చెబుతారు.  కానీ వాళ్ళకి తొమ్మిది అవతారాలే కదా పదొవది ఎక్కడి నుంచి వచ్చింది  దానిని కల్కి అంటున్నారు.  కానీ భౌతికంగా మనం ఆలోచిస్తే తల్లిగర్భంలో ఒక నెల ఒక అవతారాన్ని పొందుతుంది. బుద్ధి వచ్చి   పూర్తి మానవ ఆకారాన్ని తయారు చేసుకొని బయటకు వస్తుంది. తను పుట్టినప్పుడు ఏమి తెచ్చాడు కట్ట బట్ట కూడా లేదు. భౌతికంగా మరణించేటప్పుడు అదే పరిస్థితి  బట్టలు కూడా లేకుండా అగ్నికి ఆహుతి అవ్వడం. ఆత్మ పరమాత్మల సంబంధం అని చెప్పడం కోసం వేమన ఈ పద్యాన్ని రచించాడని వేదాంతులు వివరిస్తారు. పెద్దల సహకారంతో  తన బుద్ధి కుశలతతో  ఎంతో కష్టపడి అంకితభావంతో  ఉద్యోగము లేక వ్యాపారము చేసి ధనాన్ని సమకూర్చి తన కుటుంబాన్ని పోషించడం  జరుగుతోంది.  ఎన్ని లక్షలు సంపాదించినా అతనికి తృప్తి లేదు.  జీవించడం కోసం గుప్పెడు  మెతుకులు చాలు విపరీతంగా తను సంపాదించిన ఆ  బంగారాన్ని వేసుకుని తినలేడు  కదా ఏ కూరలో నైనా ఉండ వలసినది ఉప్పు. ఆ ఉన్న పదార్థాన్ని తప్ప దేనిని తినగలడు అన్నం ఎక్కువ తిన్నా తక్కువ తిన్నా ప్రమాదమే తక్కువ తింటే ఆకలి తీరదు, ఎక్కువ తింటే జీర్ణించుకోలేడు తన అనుభవంతో  రాజుగారి తమ్ముడిగా  ఐశ్వర్యాలను అనుభవించి చెప్పిన ఆటవెలదిని చదివితే అర్థం అవుతుంది.


కామెంట్‌లు