సునంద భాషితం;-వురిమళ్ల సునంద, ఖమ్మం

 గమనించు..శ్రమించు..
*******
మన సమాజంలో ఎందరో ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తులు  కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ గురించి ఇంట్లో పెద్ద వాళ్ళు తరచూ మాట్లాడు కోవడం వింటుంటాం.
 వాళ్ళు పడిన కష్టాలు, ఎదుర్కొన్న ఇబ్బందులు.. వాటిని అధిగమించి తాము చేరుకున్న ఉన్నత స్థాయిని గురించి చెబుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది.
 పాఠ్య పుస్తకాలలోని గొప్ప వ్యక్తుల జీవితాలను చదవడమే కాకుండా, ఇలా మన చుట్టూరాఉన్న వ్యక్తులను గమనిస్తూ, వాళ్ళు ఆ స్థాయికి ఎలా ఎదిగారో తెలుసు కోవాలి. వాళ్ళే మనకు ఆదర్శం కావాలి.
వాళ్ళలా మనకు ఇష్టమైన రంగంలో ఎదిగేందుకు ఓ లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. పట్టుదల కృషి అంకిత భావంతో దాన్ని చేరుకునేందుకు నిరంతరం శ్రమించాలి.
అప్పుడే మన గురించి కూడా నలుగురు గొప్పగా చెప్పుకునే స్థాయికి ఎదుగుతాం.
చిన్నప్పటి నుంచే గమనించడం, శ్రమించడం నేర్చుకుంటే గెలుపు తథ్యం.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏
కామెంట్‌లు