సునంద భాషితం;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 పాటించు..సూచించు..
*******
నేటి యాంత్రిక జీవనంలో అలవాట్లు పద్దతులు అన్నీ మారిపోతూ ఉన్నాయి.అందువల్లే నేటి తరం అనేక రకాలుగా మానసిక ,ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నది.
మంచి అలవాట్లు పద్దతులను మనం పాటించడం వల్ల ఎలా ఉన్నామో ఎరుక పరుస్తూ, వారిని కూడా పాటించేలా ప్రోత్సహించాలి.
నేటి తరం ఆహార, విహార విషయాల్లోనే కాకుండా ,సమస్యల విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటున్నారు.
కాబట్టి అలాంటి పొరపాట్లు చేయకుండా సరైన పరిష్కార దిశగా ఆలోచించేలా ,తగిన సూచనలు ,సలహాలు ఇస్తూ ఉండాలి.
వారి ఆరోగ్య వంతమైన ఆహ్లాదకరమైన జీవితానికి  మనం చెప్పే మంచి అలవాట్లు, పద్దతులు ఎంత ఉపయోగకరమో తెలుసుకునేలా చేయాలి.
 మన సూచనలు పాటించి ఆచరించేలా చేయడమే వారి కంటే ముందు తరం వారిగా మన కర్తవ్యం.
 ప్రభాత కిరణాల నమస్సులతో🙏


కామెంట్‌లు