నాపై నాకు నమ్మకం;----సుమ.

  సమ్మతి నొసగరా ప్రభూ 
నాపై నాకు నమ్మకమీయరా !
చీకటివెలుగుల వింజామరలో 
చీకటికి వెన్ను చూపని ధైర్యాన్నీయరా !
గెలుపు ఓటమిల పోరాటంలో 
ఓటమికి వెరవని సత్తువనీయరా !
ఆటుపోటుల జీవన సంద్రంలో 
ఎదురీది నిలిచే ఓరిమి నీయరా !
ఆనందం ఆవేదనల చట్రంలో 
ఆవేదనకి అలవని ఉత్సాహాన్నీయరా !
సమ్మతి నొసగరా ప్రభూ 
నాపై నాకు నమ్మకమీయరా !
కామెంట్‌లు