సునంద భాషితం;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 సంతానం..సంస్కారం.
******
తల్లిదండ్రులు తమ సంతానం సంతోషంగా  ఉండేందుకు ప్రతి క్షణం తపిస్తూ ఉంటారు. వారి ఆనందంలో తమను చూసుకుని ఎంత పెద్ద కష్టాన్నైనా భరించడానికి సిద్దంగా ఉంటారు.
సంతోషాన్ని ఇవ్వడం ఒక్కటే కాదు వారిలో సంస్కారాన్ని నేర్పడమనేది కూడా చాలా ముఖ్యమని తల్లిదండ్రులు గమనించాలి.
సంస్కారం నేర్వని సంతానంతో తామే కాదు సమాజం కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

తమ సంతోషం కోసం తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టే సంతానంలోని దుర్గుణాలను మార్చాలి. 
చిన్నప్పటి నుంచే వారిలో సభ్యత, సంస్కారం నేర్పక పోతే తల్లిదండ్రులు జీవితాంతం ఏడవాల్సిన పరిస్థితులు రావచ్చు.
సంస్కారం నేర్చుకున్న సంతానం సమాజంలో గౌరవింపబడతారు. తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తారు.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

కామెంట్‌లు