తెలుగు భాష సత్కారం ఎన్టీఆర్ అవార్డు అందుకున్న శ్రీమతి నెల్లుట్ల సునీత
 నందమూరి తారక రామారావు గారు శతజయంతి మహోత్సవాలు
అఖిలభారత తెలుగు అకాడమీ బెంగళూరు వారి ఆధ్వర్యంలో పి.బి సిద్ధార్థ కళాశాల సభా ప్రాంగణం మొగల్రాజపురం విజయవాడ లో వైభవంగా, ఘనంగా నిర్వహించారు.
శ్రీ గారపాటి రామకృష్ణ అధ్యక్షతన
సభానిర్వహణ సాంబశివరావు గారు నిర్వహించారు.
తెలుగు భాషా పరిరక్షకులు ప్రజలే సదస్సులో శ్రీమతి నెల్లుట్ల సునీత పాల్గొన్న తెలుగు భాష గొప్పతనం సంస్కృతిని గురించి కుటుంబం పాఠశాల సమాజం  ఉద్యమ స్ఫూర్తి గా ప్రతిజ్ఞ గా  నిరంతరం  తీసుకొనే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకొని ముందు తరాలకు అందించాలి. భాష యొక్క గొప్పతనాన్ని ప్రజల్లో అవగాహన  పరచాలి అనీ ప్రసంగించారు.
ఈ సదస్సులో వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన ఆచార్యులు తెలుగు అధ్యాపకులు తెలుగు భాషా సేవకులు ప్రముఖులు పాల్గొన్నారు.
వివిధ రంగాలలో తెలుగు ప్రముఖులకు  ఎన్టీఆర్ అవార్డులు ప్రధానం చేశారు. సాహితీ బృందావన విహార వేదిక  వ్యవస్థాపక అధ్యక్షురాలు,ఉమెన్స్ రైటర్స్  నేషనల్ అసోసియేషన్ చైర్ పర్సన్, తెలుగు అధ్యాపకురాలు, భాషా సేవకురాలు, ప్రముఖ కవయిత్రి శ్రీమతి  నెల్లుట్ల సునీత తెలుగు భాషా సత్కారం, ఎన్టీఆర్ అవార్డు అందుకున్నారు.
రాజకీయ ఋషి అనే శీర్షికతో కవి సమ్మేళనంలో పాల్గొని కవితా గానం చేశారు.
శ్రీమతి నెల్లుట్ల సునీత
తెలుగు భాష సేవకు ఈ పురస్కారం అందించామని తెలిపారు.
ముఖ్యఅతిథిగా మాజీ మంత్రివర్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు వడ్డే శోభనాద్రీశ్వరరావు
పాల్గొన్నారు. స్వాగత ప్రసంగం నన్నపనేని నాగేశ్వరావు గారు చేశారు.
మాజీ మంత్రివర్యులు మండలి బుద్ధ ప్రసాద్ గారు గౌరవ సంపాదకత్వంలో ,సంపాదకులు డాక్టర్ జి పూర్ణచంద్ గారి సంపాదకత్వంలో,  నయనానందకర కుడు తారకరాముడు ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు.
మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ నాగులపల్లి భాస్కర్ రావు గారు సి ఎం ఎస్ అధినేత న్యూఢిల్లీ సభను ప్రారంభించారు.
ఉపాధ్యక్షులు పరుచూరి శ్రీనివాస్ కన్వీనర్ బూరుగుపల్లి శ్రీ హర్ష ప్రధాన కార్యదర్శి కె రామ జోగేశ్వరరావు కోశాధికారి టి వి వి ప్రసాద్  సాహితీవేత్తలు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
తెలుగుభాష సత్కారం తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని శ్రీమతి నెల్లుట్ల సునీత తెలిపారు బాధ్యతను మరింత పెంచిందని ఆమె
అఖిలభారత తెలుగు అకాడమీ బెంగళూరు అధ్యక్ష ,కార్యవర్గానికి నిర్వాహకులకు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఉమెన్స్ రైట్స్ నేషనల్ అసోసియేషన్ సభ్యులు
విజయ శ్రీ దుర్గా, గీతా రాణి, చంద్రకళ, కవితా సుభాష్, గీత శ్రీ, యామిని కొల్లూరు, ముంతాజ్ బేగం ఎస్ రత్న లక్ష్మి, డాక్టర్ బృంద, జగదీశ్వరి మూర్తి, అరుణ కుమారి సూర్యకాంతి , ఆల్ ఇండియా రేడియో అనౌన్సర్ ఉదయభాస్కర్ గార్లు ,శ్రీమతి నెల్లుట్ల సునీత ను అభినందించారు.


కామెంట్‌లు