"తానా" అంతర్జాతీయ గేయ కవితా సమ్మేళనానికి ఎంపికైన కవయిత్రి "చంద్రకళ.దీకొండ"
 ఉత్తర అమెరికా తెలుగు సంఘం"తానా" 
ప్రపంచ సాహిత్య వేదిక సంయుక్తంగా 
పలు సామాజిక అంశాలపై ప్రతిష్ఠాత్మకంగా "అంతర్జాతీయ గేయ కవితల పోటీలు" నిర్వహించింది.
ఈ పోటీలో మేడ్చల్ జిల్లాకు చెందిన స్కూల్ అసిస్టెంట్, కవయిత్రి శ్రీమతి చంద్రకళ.దీకొండ గారు ఎంపికైనారు.మే 27,28,29 తేదీలలో  జూమ్ సమావేశంలో నిర్వహించబోతున్న ప్రపంచస్థాయి వేదిక మీద చంద్రకళ 
తన గేయాన్ని ఆలపించబోతున్నారు.
"వ్యక్తిత్వ వికాసం" అంశం క్రింద తాను స్వయంగా రచించిన 
"గతం నుంచి గుణపాఠం నేర్చుకో" అనే 
గేయం పోటీలో ఎంపిక చేయబడింది.
ఇంతటి విశేషమైన ఈ కార్యక్రమంలో 
ఎంపిక చేసి, అంతర్జాతీయంగా పరిచయం చేస్తున్నందుకు "తానా" అధ్యక్షులు 
శ్రీ అంజయ్య చౌదరి లావు గారికి,తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త శ్రీ చిగురుమళ్ళ శ్రీనివాస్ గారికి, నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర గారికి ఆమె మనఃపూర్వక ధన్యవాదములు తెలియజేసారు.
దేశ,విదేశాలనుండి అనేకమంది ప్రముఖులు,కవులు హాజరయ్యే ఈ
 "తానా గేయతరంగాలు" కార్యక్రమం "తానా" అధికారిక యూ ట్యూబ్ ఛానెల్,ఫేస్బుక్ ఛానెల్ లలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది."యప్ టీవి" ద్వారా అమెరికాతో పాటు,యూరప్ దేశాలలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.
ఈటీవి భారత్,మన టీవి, టీవి ఆసియా 
తెలుగు మరియు ఇతర మాధ్యమాలలో ప్రసారం కానుంది.
పలు సాహితీ సమూహాలలో సామాజిక స్పృహ కలిగి సందేశాత్మక కవితలు,సమ్మోహనాలు,
సరళశతకం,తొణుకులు వంటి 
లఘు కవితాప్రక్రియలు, గేయాలు వంటివి ప్రతిరోజూ రచిస్తూ...కవిరత్న,కలం రత్న,
కవితా విభూషణ,తెలుగుశ్రీ,సుధీతిలక వంటి బిరుదులు,విశిష్ట మహిళా శిరోమణి,తెలంగాణ బతుకమ్మ జాతీయ పురస్కారం-2021,
విజ్ఞానజ్యోతి, అక్షరక్రాంతివంటి పురస్కారాలు పొందిన వీరు జిల్లా, రాష్ట్ర,జాతీయ స్థాయి కవితల పోటీలలో సైతం బహుమతులు గెలుచుకున్నారు.
టోరీ రేడియోలో,యు ట్యూబ్ ఛానెల్స్ లో 
వీరి కవితగానం ప్రసారం చేయబడింది.
*జాతీయస్థాయి బాలగేయాల పోటీ* లో ద్వితీయ బహుమతిని అందుకున్నారు.
వివిధ సాహితీ సమూహాలు నిర్వహించిన కవితా పోటీలలో నగదు బహుమతులు,
పలు  ప్రశంసాపత్రములు మరియు 
జ్ఞాపికలు అందుకున్నారు.
ప్రముఖులతో ప్రశంసలను అందుకున్నారు.
నవ తెలంగాణ,ఏషియా నెట్ న్యూస్, దిక్సూచి(ముంబై),విహంగ,తరుణి,మానవి 
వంటి ప్రముఖ పత్రికలలో,వివిధ కవితా సంకలనాలలో వీరి కవితలు
ప్రచురింపబడినాయి.
తాజాగా *తపస్వి మనోహరం* అంతర్జాల 
పత్రిక నిర్వహించిన వార్షికోత్సవ వేడుకల్లో
"రైటర్ ఆఫ్ ది ఇయర్ " అవార్డును గెలుచుకున్నారు.
ఇటీవలే మాతృభాషా దినోత్సవం నాడు వారి తొలి పుస్తకం "సున్నిత చంద్రికలు" ప్రముఖుల చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.
"తానా" వారి ప్రపంచ సాహితీ వేదికపై తన గేయాన్ని వినిపించబోతున్న చంద్రకళ.దీకొండ గారిని తోటి ఉపాధ్యాయులు,విద్యార్థులు,
పలువురు సాహితీ మిత్రులు ప్రశంసల 
వెల్లువలో ముంచెత్తుతున్నారు.


కామెంట్‌లు