సరదా ..సరదాగా
చుట్ట -సిగరెట్టూ -
బీడీ తాగావనుకో
మత్తుకోసం
గమ్మత్తుగా ...
గుట్కా -పాన్ పరాగ్
నమిలావనుకో ....
అనుభవాన్ని
పరీక్షించుకోడానికి
ముక్కుపొడుం
ఎగపీల్చావనుకో
అక్కడి నుండి
ప్రారంభం అవుతుంది
అనారోగ్యం ...
మొదలవుతుంది
బ్రతుకుపోరాటం !
అలవాటు -
గ్రహపాటుగామారి
ఊపిరితిత్తులు ....
చిల్లుల సంచులవుతాయి
నోటికేన్సరు --
తరుముకొచ్చి ...
స్మశానానికి
దారిచూపిస్తుంది ..!
దురలవాట్లకు
బానిసలుకావడం అంటే
తెలిసికూడా
మనగొయ్యిమనం -
తీసుకున్నట్టే.....!!
ఈ సరదా ...సరదాకి కూడా వద్దు ..!!---డా.కె.ఎల్.వి.ప్రసాద్-హన్మకొండ.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి