ఒకప్పుడు కౌశాంబిలోబుద్ధిసాగరుడనే కుర్రాడు ఉన్నాడు.తండ్రి చనిపోటంతో బాబాయి ఇంట్లో నానాచాకిరీ చేస్తూ చదువు సంధ్య లేక పశులకాపరిగా మారాడు.తిండికి తిమ్మరాజు పనికి పోతరాజు అని ఇంట్లో వారంతా అస్తమానం తిట్టేవారు. ఒకరోజు ధైర్యం చేసి "బాబాయ్!నేను కూరగాయలు అమ్ముతా"అంటే"ఓ అంటే ఢం రానివాడివి.నీబుర్రలో గుజ్జు తెలివిలేదు"అని హేళన చేశాడు.
నీకు ఎలాగో బుద్ధి లేదు. "బుద్ధి సాగరుడు వెంటనే అన్నాడు "బాబాయ్!బుద్ధి నే అమ్ముతాను"అని తనంటే ప్రేమ అభిమానం చూపే గ్రామపెద్ద దగ్గరకు వెళ్లి కొంత డబ్బు అప్పుతీసుకుని"ఇచట బుద్ధి అమ్మ బడును"అని తన బడ్డీకొట్టుముందు బోర్డు తగిలించాడు."ఏంట్రా నీకే బుద్ధి లేదని మీబాబాయి ప్రచారం చేస్తుంటే దాన్ని అమ్మ కానికి పెట్టావేంటి?"అని కొందరు హేళన గా నవ్వారు.
ఒక రోజు ఒక సత్తెకాలపు సత్తయ్య వచ్చి "నాకు కాస్త బుద్ధి ని అమ్మవూ?మానాన్న రోజు పనికిమాలిన వెధవ అని తిడ్తాడు"అన్నాడు.ఓవెండి నాణెం తీసుకుని ఓకాగితం మడతబెట్టి ఇచ్చాడు.అందులో ఇలాఉంది"ఇద్దరు వ్యక్తులు కొట్లాడుకునే చోట అలా నిలబడకు.నీదోవన నీవు పో"అని ఉంది.
: సత్తయ్య ఇంటికెళ్లి "నాన్నా!నీవిచ్చిన నాణెంతో కొద్దిగా బుద్ధిని కొనుక్కుని వచ్చా"అనగానే "ఓరీ!ఎవడోనీకు బాగా టోపీ పెట్టాడు"అని కొడుకు ని తిట్టి బుద్ధి సాగరుని దగ్గరకు వెళ్ళి "నీకు బుర్రలేదు అని మీబాబాయి చెప్పాడు. నాకొడుకు ని మోసంచేస్తావా?" అని తిట్టాడు. "అయ్యా!మీనాణెంమీకిస్తా!నా వాక్యంని మీరు ఆచరణలో పెట్టరాదు"అని షరతు విధించి"ఎవరైనా కొట్టుకుంటూ ఉంటే అక్కడే ఉండి చూడండి "అని నాణెంఇచ్చేశాడు.ఆఊరి జమీందారుకి ఇద్దరు భార్యలు.వారి దాసీలు ఉప్పు నిప్పు లాగా దెబ్బలాడుతూనే ఉంటారు. ఓనగలదుకాణంలో హారం నచ్చి"మాఅమ్మగారికి ఇవ్వు "అని దుకాణదారుని వేధిస్తుంటే"మీరు బైట నించి సాక్షిని తీసుకుని రండి. అతను చెప్పిన వారికే నగ ఇస్తాను"అన్నాడు.సత్తయ్య కనపడగానే దాసీలు అతన్ని పట్టుకున్నా రు.ఇంటిదగ్గర ఉన్న తండ్రి కి ఈవిషయం తెలిసింది. ఏదాసీకి వత్తాసు పలికినా ఆజమీందారు భార్యల ఆగ్రహం కి గురి కావల్సినదే!అందుకే తండ్రి బుద్ధి సాగరుని దగ్గరకు వెళ్ళి "బాబూ!నాకొడుకు ని కాపాడు"అన్నాడు."సరే వెయ్యి వెండి నాణాలు చెల్లించు"అని ఓ చీటీ ఇచ్చాడు. "జమీందారు దగ్గర పిచ్చివాడిలా నటించు"అని ఉంది. తండ్రి సలహా పై వికవికా పకపకనవ్వుతూ వెర్రివాడిలా సత్తయ్య మాట్లాడటంతో దాసీలు విసుక్కుంటూ తమ జమీందారు కి చెప్పారు.
: బుద్ధిసాగరుని వ్యాపారం గూర్చి తెలుసు కోవాలని జమీందారు వెళ్లి వేయి వెండి నాణాలు ఇచ్చి ఓచీటి తీసుకున్నాడు. "బాగా ఆలోచించి కానీ ఏపనీ చేయొద్దు "అని ఉంది. ఆరోజు జమీందారు భార్యల దాసీలు తెచ్చిన పండ్లరసాల గ్లాసులు చూస్తూనే జమీందారు కి అనుమానం వచ్చింది. బుద్ధి సాగరుడు ఇచ్చిన చీటీవాక్యం గుర్తు కొచ్చి "ఈ గ్లాసులోని పానీయాలు మీఇద్దరూ తాగండి" అని ఆజ్ఞాపించాడు. ఇద్దరూ గజగజవణుకుతూ "మేము ఇందులో మత్తుమందు కలిపాము. మీభార్యలకు మీమీద కోపం అనుమానం!"అని నిజం చెప్పారు.అంతే!జమీందారు భార్యల దుష్ట స్వభావాన్ని గ్రహించి ముసలివాడైన తను పడుచు పిల్లలని పెళ్లాడి తప్పు చేశానని గ్రహించాడు.అందుకే పిల్లలు లేని ఆయన బుద్ధి సాగరుని చేరదీసి జమీందారీ వ్యవహారాలు అప్పజెప్పాడు.తాను భగవధ్యానంలో ఉంటూ ప్రజలకి కావాల్సిన ఆసుపత్రి బడి సత్రాలు కట్టించాడు.బుద్ధి సాగరుని కీర్తి నలుదిక్కులా వ్యాపించింది🌷
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి