ప్రతీ బంధం విలువైనదే
ప్రతీ అనుభూతి ప్రత్యేకమైనదే
మనసులోని సున్నితత్వాన్ని
జారిపోకుండా పదిలపరచుకుంటే
జీవితం ఓ పాటలా అనిపిస్తుంది !
స్పందించే గుణాన్ని స్వంతం చేసుకుంటే
మానవత్వపు సిరులు లభించినట్లే !
మన తప్పులు మనమే గ్రహించుకుంటే
అర్థం పరమార్థం విడమరచనక్కరలేదు !
అశాంతి చీకట్లను పారద్రోలి
అనురాగ దివ్వెలను వెలిగించగలం
చిరునవ్వుల కాంతిని పూయించగలం !!!
చిరునవ్వుల కాంతి --------సుమ.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి