యుగపురుషుడు --మనతారకరాముడు ..!!------డా.కె.ఎల్.వి.ప్రసాద్.హన్మకొండ .

 తెలుగుదేశం 
నాయకుడుకాకముందే 
తెలుగునటుడిగా 
ఎన్ .టి .ఆర్ . అంటే
నాకెంతోఇష్టం ...!
నిండైన విగ్రహం 
అందమైన ముఖం 
తెలుఁగు -భాషపై 
చక్కని పలుకుబడి ,
ఏపాత్రనైనా ...
సజీవంగా పండించగల 
నటరత్నం ఆయన....!
సామాన్యుడు సైతం 
'ఎన్టీవోడు ' అని 
ప్రేమగా పిలుచుకునే 
ఈతెలుగు అగ్రనటుడు ,
' సినారె ' వంటి 
గీతరచయితలకు 
వెండితెరపైకి -
ఆహ్వానించిన ఘనుఁడు !
' ఎన్ఠీఆర్ ఎస్టేట్ ' నిర్మించి 
అబిడ్స్ కు ,
మరింత ప్రాచుర్యం కల్పించి 
నగరస్థాయిని పెంచినవాడు 
ఈ అందాలనటుడు ..!
మల్లీశ్వరీ ..పాతాళభైరవి 
గుండమ్మకథ ..నర్తనశాల వంటి 
సినిమాలుచూసి ...
"నటుడంటే ఈయనేసుమా! "
అనుకున్న క్షణాలు 
నాయవ్వనపు రోజులు !
కొమ్ములుతిరిగిన 
రాజకీయనాయకుల 
కొమ్ములు విరిచి ..
అతికొద్దిసమయంలో 
తెలగుదేశం పార్టీని స్థాపించి 
ప్రజానాయకుడై ...
ముఖ్యమంత్రి కావడం 
ఒకచరిత్ర ...!
ఊరూపేరూలేనివాళ్ళకి 
రాజకీయభిక్షపెట్టి 
వాళ్ల జీవితాలలో 
వెలుగునింపిన చరిత్రకారుడూ 
ఎన్ .టి .ఆరే ....!
ఇప్పుడు ....ఆయన్ను మరచి 
రోజుకొక కండువామార్చి 
రాజకీయ పబ్బంగడుపుకుంటున్న ,
ఎందరెందరో ..
ఎన్ టి ఆర్ ..అంటే 
తెలియనట్టు నటిస్తున్నవారే !!

కామెంట్‌లు
డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్ చెప్పారు…
ఎన్టీఆర్ జీవితం విభిన్నమైన ఎన్నెన్నో ఘటనల సమాహారం
ఎందరెందరు ఎన్నెన్ని కోణాల నైనా స్పృశించి పరవసించ వచ్చు...!బాగుంది !👏👏👏👏...అందరూ అభిమానంతో
ఆయన అద్భుత ఘనకార్యాల నూ... విజయాలనూ విశిష్ట నటజీవితాన్నీ... అక్షరీకరించి అభిమానాన్ని చాటుకుంటుంటే
నేను... వారి జీవిత చరమాం కంలో... ఆత్మావలోకనంతో...
పడ్డ ఆవేదనను ఓ చిన్న ఏకపాత్ర రూపంలో... అక్షరీక రించి నివాళులర్పించాను !
---కోరాడ నరసింహారావు
విశాఖపట్నం
Shyamkumar chagal చెప్పారు…
జీవితంలో అన్ని ఎలా సాధించాలో
జీవితాన్ని ఎలా బ్రతకాలో
పట్టుదల అంటే ఏమిటి
ప్రత్యక్షంగా చూపించిన వ్యక్తి ఎన్టీఆర్

అలాగే ఒక మనిషి ఎలా చావకూడదు కూడా చూపించాడు
Dondapati Nagajyothi చెప్పారు…
యుగ పురుషుడు ఎన్ఠీఆర్...డాక్టర్ గారు వారి వ్యక్థత్వం గూర్చి చక్కగా రాసారు