ఆపెద్ద చెట్టు పై ఓపక్షిజంట గూడుకట్టుకుని ఒద్దికగా ఉంటున్నాయి.ఆడపక్షి బియ్యం తెచ్చింది.మగది పప్పు తెచ్చింది.ఆరెండింటినీ కలిపి తగినన్ని నీళ్ళు పోసి పొయ్యి పైన కిచడీ వండుతోంది ఆడపక్షి. మంచి నీరు తేవాలని భార్య బైట కి వెళ్ళగానే నోరూరి మగది మొత్తం గుటకాయస్వాహా చేసింది.ఆపైఎంచక్కా మొహంనిండా ముసుగుకప్పి గుర్రుకొట్టింది."ఏమయ్యోయ్!తలుపు తీయి."అని భార్య ఎంత మొత్తుకొన్నా ఉహు! ఉలుకుపలుకు లేదు. నెత్తిన నీటి కుండ బరువు! తలుపులు టపటపా బాదాక చాలా సేపటికి మగది మూల్గుతూ అరిచింది"అయ్యో రామ!నాకళ్లు మంటలుగా ఉన్నాయి.లోపలకి చేయి పెట్టి గడియ తీసుకుని రా!" పాపం చేసేదేమీ లేక భార్య పక్షి తలుపులు గట్టిగా గెంటగానే తెరుచుకున్నాయి. కానీ కుండ భళ్ళున బద్దలై అడుగుభాగం లో కొద్దిగా నీరు మిగిలాయి. ఆకలి దంచేస్తోంది.కానీ ఖిచడీ గిన్నె ఖాళీ!పాపం ఏడ్పువచ్చినంత పనైంది."ఓ రాజా!ఖిచడీ ఏమైంది?" "నాకేంతెలుసు?తలనెప్పి అని పడుకున్నా బట్ట బిగించి! ఆ! రాజు గారి కుక్క వచ్చినట్లుగా ఉంది. కుయ్ కుయ్ అని వినపడింది."చిడీరాణి రాజు గారి దగ్గరకు వెళ్లి "మీకుక్క మాఇంట్లో ఖిచడీ మొత్తం తినేసింది."అనగానే కుక్క మొరుగుతూ"భలేదానివే!నీ చిడారాజా మహా సోంబేరీ! వాడే లాగించి ఉంటాడు"అని అడ్డుపుల్ల వేసింది. రాజు గారు ఇలా సమస్య తేలదని "ఆచిడాని తేండి"అని భటులకి చెప్పాడు. ఓభటుడు వెంట ఉండి చిడారాజుని తెచ్చారు. "కుక్క చిడాపక్షి పొట్టలు చీల్చండి.దొంగబైట పడతాడు "అనగానే చిడా భయంతో వణికింది. తన తప్పు ఒప్పుకుంది.రాజు గారికి అసలే కోపంగా ఉంది. తన కుక్క పైన అనవసరంగా నింద వేసినందుకు!"చిడాని ఆదిగుడు బావిలో వేయండి"అని ఆజ్ఞాపించాడు. భర్తను బావిలో వేయటంతో ఆడది బావిగట్టుపై ఏడుస్తూ కూచుంది.గేదెలు తోలుకెళ్తూ అటుగా వెళ్తున్న పశులకాపర్ని "బాబ్బాబు! నామగడ్ని బావిలోంచి తీయవా?" అని బ్రతిమాలింది."నాకేమీ పనిలేదు అనుకున్నావా?"అనేసి వెళ్లి పోయాడు. మేకలు కాసేవ్యక్తి కూడా ససేమిరా అన్నాడు. ఒంటెలతో వెళ్లేవాడు జాలిపడి బావిలోకి దిగి చిడారాజాని బైట కి తీశాడు. "ఇంకెప్పుడూ అబద్ధాలు చెప్పి నీప్రాణం మీదకి తెచ్చుకోకు.నీభార్య ను చూసి సిగ్గు తెచ్చుకో"అని బుద్ధి చెప్పి తనదోవన తాను వెళ్లాడు. బద్ధకం వదులుకుని మగపక్షి భార్య కు సాయంచేస్తూ అబద్ధాలు ఆడటం మానేసింది🌹
కిచిడీ! అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి