అజ్ఞానం;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి.
 ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతిజీవి శూద్రుడే. తల్లి గర్భం నుంచి పుట్టిన బిడ్డ బొడ్డు దగ్గర మావితో కలిసి పుడతాడు "మావి" అంటే పనికి రాని పదార్థము (శుద్రము) వైద్యులు ఆ మావిని కత్తిరించి  పారవేస్తారు. తరువాత అక్షరజ్ఞానం తెలుసుకొని  ద్విజుడు అవుతాడు.  ద్విజుడు అంటే బ్రాహ్మణుడు అని చెబుతారు.  ద్విజుడు అంటే  రెండవ జన్మ కలిగినవాడు అజ్ఞానంతో ఉన్నవాడు  జ్ఞాన సముపార్జనకు  చేసే ప్రయత్నం. అక్షరాన్ని  తెలుసుకోవడం నాలుగో ప్రయత్నంలో.దానిలో బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేవాడు బ్రాహ్మణుడు అవుతాడు  అంటే  భారతీయుల  మూల గ్రంథాలైన వేదాలు, ఉపనిషత్తులు, భారత, భాగవత, రామాయణం గీత జ్ఞానాన్ని పొందిన వాడు. అలాంటి వారికి సమాజంలో  ప్రథమ స్థానం ఉంటుంది. వారు చెప్పిన ప్రతిదీ అనుసరనియ్యమే.
ప్రపంచానికి ధర్మబోధ చేసిన వాల్మీకి మహర్షిని మరో ఉదాహరణగా తీసుకుంటే  వేటాడి తన కుటుంబాన్ని పోషించేవాడు, ఒంటరిగా అడవిలోకి వచ్చినవారి  సొమ్ములను  దొంగిలించేవాడు  అలాంటి అజ్ఞానికి ఒకరోజు నారదమహర్షి కనిపించి జ్ఞాన బోధ చేసి రామ శబ్దాన్ని ఉచ్చరించమంటే మర అన్నవాడు. మహర్షి ఆజ్ఞమేరకు  తపస్ససమాధికి వెళ్లి  తనను తాను  తెలుసుకొని  ప్రపంచంలో శాశ్వతంగా ఉండే విధంగా  శ్రీ రామచంద్ర మూర్తి చరిత్ర రామాయణం పేరుతో రచించాడు. నిజానికి వారు చెప్పదలచుకున్నది వేదాన్ని గురించి జటాయువు అంటే వేదము యొక్క ఆయువు పట్టు. సామవేదం  దానిని వేదత్రయగా  విభజన చేయడమే  రామాయణం.  త్రిజట  విభీషణుని కూతురు  వేదమును మూడు భాగములు చేయడం త్రిజట అన్న దానికి అర్థం. అలాంటి శాశ్వతమైన గ్రంధాలు వ్రాసిన అజ్ఞాని  జ్ఞానిగా మారి  ప్రపంచం నలుమూలల నుంచి  పొగడ్తల నందుతూనే ఉన్నాడు. 


కామెంట్‌లు