పరోపకారం;--సుమ...

 పరోపకారం అంటే ;. 
ఇతరుల పనులలో నిమగ్నమవటం కాదు! 
ఇతరుల కోసం త్యాగం చేయటం కాదు !
మనిషి తనకు తాను జీవిస్తూనే 
ఇతరులకు ప్రయోజనకరమయ్యే రీతిలో 
తనకు తాను మలచుకోవడం !
ప్రకృతికి సమకాలీన సమాజానికి 
హానికరం కాకుండా చూసుకోవడం !
బాధ కలిగినప్పుడు దుఃఖం లా  
సంతోషం కలిగినప్పుడు నవ్వు లా 
సహజంగా పరోపకార చర్య ఉండాలి !
ఒకరి క్షేమం అందరి క్షేమం ... 
అందరి శ్రేయస్సు ఒకరికి శ్రేయస్సు !!!
కామెంట్‌లు