కోతి చాతుర్యం! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఓసారి కోతి కుందేలు పందెం వేసుకున్నాయి.పొరుగూరు పొలిమేర త్వరగా చేరేవారు  పందెం గెలిచినట్లు లెక్క!తమకు జడ్జీగా తాబేలు ని పెట్టాయి.పొలిమేరల్లో ఉన్న తాబేలు ఎవరు ముందు వచ్చారో నిర్ణయిస్తుంది. కోతి భార్య మహా తెలివిగలది."కోతి బావా!మన ఇద్దరం ఒకేరకం దుస్తులు ధరిద్దాం.నేను ముందే  తాబేలు ఉన్న చోట  చెట్టు పై నక్కుతాను.కానీ  మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. నీవు  కుందేలు  పరుగు ప్రారంభించాక నేను ముందే  ఓచెట్టుపై కూచుంటా.కాస్త దూరం పరుగెత్తగానే  నీవు ఆగిపో.అల్లంత దూరంలో కుందేలుని చూసి నేను తాబేలు ఉన్న ప్రాంతం చెట్టు పై కూచుంటా."అని సలహా ఇచ్చింది.కోతి సరేనంది ముప్పావు దూరం రాగానే  కోతి బావ అంది"కుందేలూ!ఎలాగో గెలుపు నీదేలే!కాసేపు చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటా.నీవు వెళ్తూ ఉండు."అంది.కుందేలు కూడా అలిసింది.కానీ పైకి బింకంగా అంది"అలాగే!నేను మాత్రం పరుగులు పెడతా. కుందేలు ఇలాగే మోసంచేసింది."అని  తాబేలు  అరకిలోమీటరు దూరంలో ఉండగా కాసేపు పొదల్లో కునుకు తీసింది.కోతి భార్య  తాబేలు సమీపంలోని చెట్టు పై కూచుని కుందేలు కోసం  ఎదురు చూస్తోంది. మగకోతి ముందుకి పోతూ "ఏయ్ కుందేలూ!పరుగులు పెట్టు"అని హెచ్చరించటంతో దాని నిద్ర మత్తు కాస్త వదిలింది.పైన ఎండ చుర్రు నిద్ర మత్తు తో కుందేలు బలవంతబ్రాహ్మణార్ధం పరుగులు పెట్టింది.నాలుక పిడచ కడ్తోంది.కోతి బావ కాస్త దూరం లో కన్పిస్తోంది. కళ్ళు బైర్లు కమ్ముతుండగా కుందేలు కళ్ళు మూసుకుని ఓ ఐదు నిమిషాల తర్వాత  కళ్ళు తెరిచి చూసింది. మగకోతి  అక్కడే చెట్టు ఎక్కితే  ఆడకోతి కన్నుమూసి తెరిచేలోగా తాబేలు ని చేరింది. దూరంనించి చూసిన కుందేలు నిరాశ పడింది. ఆడమగకోతులు ఒకేరంగు దుస్తులు ధరించటంతో అమాయకపు తాబేలు  కోతిని గెలుపొందినట్లు గుర్తించింది.కుందేలు కుదేలై నీరసంగా కూలబడింది.చూశారా!మనుషులు కూడా మాటలతో బోల్తా కొట్టిస్తారు.చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా!🌹
కామెంట్‌లు