అభినందన @ * కోరాడ నరసింహా రావు
ఆహా... ఓహో.... అంటే... ఉబ్బి  తబ్బిబ్బైపోయాను !
నిజమే ననుకుని... లేని గొప్ప తనాన్నూహించేసుకుని.......
తెగ మురిసిపోయాను !!

నిజమెప్పుడూ నిలకడమీదేగా
తెలిసేది !
     నేను... ఏది అనుకుని రాస్తు
న్నా నో...అది  అసలదికానే కా దని... అనుభవం మీద బాగానే బోధపడింది !

నన్ను ములగచెట్టెక్కిoచేస్తున్నా రో...ఎవరెస్టుకుఎగదోస్తున్నారో...తేల్చుకోలేక కొన్నాళ్ళు సతమతమై పోయాను !
     నామీద ప్రేమతోనే ... అను కున్నంతలో, నన్ను పొగిడి... 
నాచేత వాళ్ళని పొగిడించు కోవాలనేమో...! అనే  అను మానం వచ్చేది !
     స్వప్రయోజనం కోసమే ఐతే నేం...అభిమానంతో ఐతేనేం..., 
ఏదైనా...ఒకఅభినందనమనిషి లోఉత్సాహాన్ని కలిగించి నమ్మ కాన్ని పెంచుతుంది...అని నాకు
మాత్రం అనుభవపూర్వకంగా రుజువైంది !
     మనిషి  ఎదుగుదలకు ......
అభినందన ఓ అద్భుతమైన ఔషధమే... !!
       ******

కామెంట్‌లు