కైత పుట్టు కంటె
కమనీయ మెద్ది?
కాంతిరేఖ కంటె
దృశ్యమానమేది?
నిలిచి మెప్పు పొందు కంటె
సాక్ష్యమెద్ది?
శతాబ్దాల చరిత్రలో
లిఖింపబడు కంటె
భాగ్యమేది?
తల్లి దీవెన కన్న
గొప్ప యేది?
జ్ఞాన సముపార్జన కన్న
దారి యెద్ది?
ఆకలిగొన్నప్పుడిచ్చు
ఆహారమున కన్న
అమృతమేది?
జీవించియున్నప్పుడే
సుఖపెట్టుట కన్న
సంతోషమేది?
అవసరమున్న చోట పడు
వర్షము కన్న
సహాయమింకేమి?
బాధ ననుభవించు
హృదయమునకు
చల్లని మాట కన్న
ఓదార్పు యేది?
ప్రేమ పంచుట కన్న
పరమార్థ మింకేమి?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి