21). ఆమె బాటను కందాము
ఈమె మాటను విందాము
మన మనిషిని కోరుతుంది
ఐ ఉన్నది మన బంధము !
22). ఆమె పలుకు బంగారం
రూప మేమొ సింగారం
తనేగా మన సర్వస్వం
చూస్తుంది వ్యవహారం !
23). చక్కబెట్టునులే పనుల
కాపాడునుగా దీనుల
తను అసామాన్యురాలు
తొలగించునుగా ఇడుముల !
24). లాల పోసి జోలపాడు
సదా ఆమె ఉండి తోడు
తోడు నీడగా ఉంటది
ఆలకించును నీ గోడు !
25). స్నానం చేపిస్తుంది
తిలకం దిద్దేస్తుంది
పదం అంటే ఇష్టం
నష్టం కాదంటుంది !
26). ప్రతి పనిని చేస్తుంది
తాను సర్వం మోస్తుంది
ఆమె ఇలలో సమస్తం
పని భారం వహిస్తుంది !
27). ఒక్కటే తనకు అందరు
కలసి మెలసి వారుందురు
ఆమె తన వారంటుంది
ఇక ముద్దుగా చూస్తుంది !
28). పడతి మనసు చల్లన
నడిచొస్తోంది మెల్లెన
పుడమికి ఆమె తల్లి
కట్టే చీర తెల్లన !
29). క్షమించే గుణం గలది
మృదువైనది ఆమె మది
తాను కారుణ్య మూర్తి
భేద భావం చూపనిది !
30). పుడమిలో చరిత్ర గలది
పుటలో లిఖించుకున్నది
మకుటంలేని యువరాణి
సురాజ్యం చేస్తున్నది !
గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి