స్వయంకృతం ;-ఎం. వి. ఉమాదేవి --వనజ
చుట్టూ సముద్రం.. చిన్న దేశం 
అయినా మంచిపర్యాటక ప్రాంతం.. 
అందమైన శ్రీలంకలో ఒకనాడు 
లేదు ఏ వంకా !
పాలకుల అత్యాశ, విచక్షణలేని 
ఉచిత పథకం ఉచ్చులు... 
గొంతుకి బిగిసిన పీటముడిగా 
ఇతర దేశాలకీ ఒక గుణపాఠమై 
రగులుతున్న శ్రీలంక... 
రక్షణలేని పరిస్థితిలో ఆర్ధికలోటు. 


ఆత్మవిశ్వాసం అడవికెళ్ళింది 
అధిష్టానం కైకవరాలు కోరింది 
వనవాసo ప్రజలకే ఇక 
గుడ్డిగా నమ్మిన పౌరులకి, గుహల్లో జంతువుల జీవితం 
ఆకలి, అరాచకత్వం పంజాతో 
తీవ్రo గా గాయపడ్డ ప్రజారక్షణ !

ఇప్పుడిక కళ్ళు తెరిచినా 
ఏ కపివీరు లో రావాలి 
చెరబట్టబడిన ప్రజాస్వామ్య సీతని కాపాడగలిగే 
చేయూత,, వారథికీ  సంకల్పమివ్వాలి !
అప్పటి వరకూ దేశం అగ్గగ్గలాడుతూనే... ! 



కామెంట్‌లు