చిత్రకవిత :- * రసాస్వాదన *;- కోరాడ నరసింహా రావు.. !

 మందార మకరంద రసాస్వా దన లో... ఆ ఖగము పొందు 
ఆనందం అనిర్వచనీయం !
    రసహృదయానికే తెలిసేది..
పొందే వరకూ వదలకవెదికే...  రసాన్వేషణం !!
  పడతి యవ్వనమాధుర్యమ్ము
ను అనుభవించ తహ - తహ తో...పురుషుడు ఆవనితచుట్టు  
వదలక తిరుగు విధమ్మున !  
తిరుగునుభ్రమరమ్ములు,తుమ్మెదలు,మకరందం రుచి తెలిసిన 
ఖగములు కూడా.... !
     ఇది ప్రకృతి ధర్మం !
         పరవశించి పులకించును 
తిలకించిన కళా హృదయం !!
       *******
కామెంట్‌లు