ఫతహ్ అనే అరబ్బీ పదంకి అర్ధం యుద్ధంలో లభించే విజయం! ఏదైనా పనిలో సఫలత చెందటం! ఫతేహ్ పుర్ సిక్రీ పాదుషాల విజయంకి ప్రతీకగా వెలసిన ప్రాంతం!
అరబ్బీ పదం ఫజల్ అంటే అనుగ్రహం కృప మెహర్బానీ! ఖుదా అనుగ్రహం తో అంతా మంచి జరుగుతుంది అనే పాజిటివ్ భావం!
ఫత్వా అనేది అరబ్బీ పదం! ముస్లిం మతగురువు ధర్మం మతంకి సంబంధించిన వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారికి శాస్త్రీయ లిఖిత ఆదేశం ఇవ్వడం అన్న మాట. లజ్జ అన్న రచనచేసిన తస్లీమా నస్రీన్ కి శటానిక్ వర్సెస్ రాసిన సల్మాన్ రష్దీ అనే రచయితలకు ఫత్వా ఇచ్చారు మతగురువులు.ఖురాన్ ని నిందించారని వారి ఆరోపణ!
రాజు లేక బాదుషా ఇచ్చే ఆదేశం రాసిఇచ్చే ఆజ్ఞాపత్రం ని ఫర్మాన్ అంటారు. ఇది ఫారశీ పదం!
ఛెస్ ఆటలోని రాణీ లేక మంత్రి పావులను ఫరజీ అంటారు. ఈఫారశీ పదంకి అర్ధం చిన్న హోదాలో ఉన్న వారికి పెద్ద హోదా లభిస్తే వారి కళ్లు నెత్తికెక్కటం అనే అర్ధం లో వాడు తున్నాం. నకిలీ అని కూడా అర్ధం ఉంది.
ఫోతేదార్ ఫారశీ పదం! కోశాధ్యక్షుడు ఖజాంజీ అంటే ధనాగారపు అధికారి అని అర్ధం. మరాఠీలో పొత్ దార్ అని హిందీ లో పోద్దార్ అని అంటారు. నాణాలు పరీక్షించేవాడని మరాఠీ గ్రంధాల్లో ఉంది.
నేడు అందరికీ బ్యాంక్ సుపరిచితమే! బెంచ్ బ్యాంక్ మూలంలో ఒకే శబ్దం. ఇటలీలోని వెనీస్ నగరంవ్యాపారకేంద్రం గా ఉన్న రోజుల్లో సెంట్మార్గ్ ప్రాంతంలో చౌరస్తా లో వ్యాపారులు బెంచీలపై కూచుని నాణాలు ఇచ్చి పుచ్చుకోటంచేసేవారు. ఇటాలియన్ భాష లో బెంచీని బ్యాంకు అంటారు. బెంచీల పై నాణాలు ఉంచేవాటికి వాడే ప్రత్యేక పదం బ్యాంక్! క్రమంగా బెంచీల బదులుగా బల్ల టేబుల్ పెట్టేవారు.వాటిని బైంకో అని పిల్చారు. డబ్బుల కుప్పని కూడా బైంకో అనే వారు. ఇది ట్యుటానిక్ శబ్దం బైంకా నించి వచ్చి నేడు బ్యాంకు గా ప్రపంచంలో స్థిరపడింది🌷

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి