ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్య వేదిక "ఆజాదీకా అమృత మహోత్సవ్" ఉత్సవాలు పురస్కరించుకుని పలు సామాజిక అంశాలపై ప్రతిష్ఠాత్మకంగా "అంతర్జాతీయ గేయ కవితల పోటీలు" నిర్వహించింది.
ఈ పోటీలో వనపర్తి జిల్లాకు చెందిన కవయిత్రి శ్రీమతి వలిపే సత్యనీలిమ గారు ఎంపికయ్యారు. మే 27, 28, 29 తేదీలలో జరుగుతున్న కార్యక్రమంలో 28వతేదీ జూమ్ లో తానా నిర్వహించబోతున్న ప్రపంచస్థాయి వేదిక మీద సత్యనీలిమ తమ గేయాన్ని పాడి వినిపించబోతున్నారు.
మాతృభక్తి అనే అంశంపై అమ్మ ప్రేమను వర్ణిస్తూ,స్వర్గానికేగిన వారి అమ్మకు అంకితమిచ్చిన "అమ్మ ప్రేమ" అనేటటువంటి వారు రాసిన ఈస్వీయ గేయం ఎంతో హృంద్యంగా,భావయుక్తంగా ఉండటంతో ఈ పోటీలో ఎంపికయింది.
ఇంతటి విశేషమైన కార్యక్రమంలో ఎంపిక చేసి, అంతర్జాతీయంగా పరిచయం చేస్తున్నందుకు
తానా అధ్యక్షులు శ్రీ అంజయ్య చౌదరి లావు గారికి,
తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త శ్రీ చిగురుమళ్ళ శ్రీనివాస్ గారికి, ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర గారికి ఆమె ధన్యవాదాలు తెలియజేశారు.
అనేకమంది దేశ, విదేశ తెలుగు కవులు, ప్రముఖులు హాజరయ్యే
ఈ "తానా గేయ తరంగాలు " కార్యక్రమం తానా అధికారిక యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. "యప్ టీవీ" ద్వారా అమెరికాతో పాటు, యూరప్ దేశాలలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.
ఈటీవీ భారత్, మన టీవీ, టీవీ ఆసియా తెలుగు మరియు ఇతర మాద్యమాలలో ప్రసారం కానుంది.
సరళమైన భాషలో, సామాజిక స్పృహ కోసం రచనలు చేసే సత్యనీలిమ గారు అంతకుముందు మూడు పుస్తకాలను ప్రచురించారు.మరియు సంకలన సంపాదకత్వం వహించారు. వృత్తి రీత్యా వీరు ప్రైవేటు ఉపాధ్యాయులు. జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయి అవార్డులు పొందారు.ప్రముఖులతో ప్రశంసలు అందుకున్నారు.
ఈరోజు వనపర్తి పట్టణ ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళిన సత్యనీలిమని నగర పెద్దలు, ప్రముఖులు, సాహితీవేత్తలు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి