తొందరపాటు తగదు;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి.
 ఏ కార్యక్రమమైనా హడావుడిగా చేయకూడదు  దాని పధ్ధతి తెలుసుకొని  పెద్దల సలహా తీసుకుని  ఆ పని చేస్తే సఫలమవుతుంది.  అలా కాకుండా ఆవేశంతో ఆ కార్యాన్ని ప్రారంభించి అడ్డదిడ్డంగా చేస్తే  పని పూర్తి కాకపోగా అతనికి చెడ్డ పేరు కూడా వస్తుంది. ఆలోచన లేని పని  అవస్థలను తెచ్చిపెడుతుంది  అని మన పెద్దలు మనకు చిన్నప్పుడే చెబుతారు. దానిని ఆచరించకుండా పెడచెవిని పెడితే ఏమవుతుంది? త్వరత్వరగా పని అయిపోవాలి అన్న  కోరిక తప్ప మంచిచెడు ఆలోచించే అవకాశం  లేకుండా పని చేస్తే  దుష్ఫలితాలు వస్తాయి తప్ప  సత్ఫలితాలు కనిపించవు. పాఠం చదవాలంటే ఏకాంతంగా దాని మీదే మనసు పెట్టి చదవాలి  తపస్సు చేయాలంటే ఎలాంటి  అవరోధాలు లేని స్థలాన్ని  ఎంచుకొని  ఏకాంత ప్రదేశంలో చేయాలి. జనంలో ఉండి చేస్తే ఏమవుతుంది  మనసు మన చెప్పుచేతల్లో ఉంటుందా  ఎప్పటికప్పుడు ప్రక్క విషయమే  చూడడానికి  తాపత్రయపడుతోంది. ప్రస్తుతం మామిడి పండ్ల  పంట మనముందుకు వస్తోంది  దురాశతోనో,  పేరాశతోనో పంటకు రాని కాయలు తీసుకువచ్చి  పైనా కిందా వరి గడ్డి వేసి పండిస్తే అవి పండుతాయా? అసలుకే మోసం వస్తుంది  సమయం వచ్చే వరకు ఆగాలి అప్పుడు చెట్టునుంచి కోస్తే  చక్కటి ఫలం మనకు అందుతుంది  ఇలాంటి విషయాలలో సహనాన్ని పాటించాలని వేమన సూచన. అది వారి పద్యాలలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.



కామెంట్‌లు