వేడుక ....!!--> శ్రీమతి లక్ష్మి పద్మజ .దుగ్గరాజు

 వసుదైక కుటుంబం
ప్రత్యక్ష దర్శనం...
గురువుల ఆగమనం
శిష్యుల కోలాహలం
తెలియని వయో వర్గ భేదం
గత స్మృతుల సంభాషణం
దశాబ్దాల తర్వాత కలయిక
ఉపాధ్యాయ దినోత్సవం వేడుక
అంబరాన్ని తాకిన ఆనందం
గురువుల దర్శనం తో 
శిష్యుల పరమానందం
మదిలో ఎగిరిన చిన్ననాటి 
స్మృతుల పక్షులు
మరువలేని మధుర జ్ఞాపకాలు
మరిచిపోలేని అనుభవాలు
మరపురాని అనుబంధాలు
చిన్ననాటి ఘటనల నెమరువేత
తలపుకు వచ్చిన గురువుల చేయూత
జన్మ నిచ్చిన తల్లిదండ్రులు
జీవితాన్ని ఇచ్చిన గురువులు
ఇరువురి ఆశీస్సులతో 
జీవన పురోగమనం
దూర తీరాల నుండి 
మితృల ఆగమనం
ఎన్నో అనుభూతులు, 
మరెన్నో అనుభవాలు 
పంచుకోవాలనే ఆరాటం
నివాసాలు దూరా భారం చేత 
సమయాభావం
లేనే లేదు కలిమి లేముల భేదం
అసలే తెలియదు కులమతాల విభేదం
అందరి మనస్సుల్లో 
అనుభూతుల భాండాగారం
పూర్వ విద్యార్ధుల సమ్మేళనం 
ఓ ఆనంద సాగరం
తలవని తలంపుగా, 
అనుకోని అతిథులు గా 
చిన్న నాటి మిత్రుల కలయిక
అనిపించింది ఈ జన్మకిది చాలిక
తమ శిష్యుల ప్రగతి ని చూసి 
పొంగిన గురువుల డెందం
గురువుల ఆశీస్సులు 
అందుకున్న శిష్యుల పరమానందం
దండించినా, శిక్షించినా గురువులే దేవతలు
గురువులు చెక్కిన శిల్పాలు శిష్యులు
మలినం లేకుండా మలచిన రూపాలు శిష్యులు

కామెంట్‌లు