ఆహా... ! విధి బలీయమే.
విశ్వవిఖ్యాత నటసార్వ భౌము డనని ఖ్యాతిని గడించి, యావత్ ప్రపంచ ప్రజాభిమాన మును చూరగొన్న నేను...నేడీ దురవస్థననుభవించుటయా!?
కేవల కళా రంగమునకే జీవితమునంకితము గావించక
ప్రజా క్షేమమును మదిని దలఁచుటయే నేరమాయెనా ?!
అది అవినీతిరొంపి యని తెలిసి తెలిసి, నేనేల ఆ రాజకీయ రంగప్రవేశము జేయవలె !
చేసితినిపో... అందరివలెనే
నేనునూ అల్లుళ్ళూ,కొడుకులూ
బంధువులకేల అవకాశమీయ వలె !తుచ్ఛమైనఇట్టిబంధుప్రీతి
నాకేల కలుగవలె !!
అభిమానించి,అందలమెక్కిం
చిన ప్రజల ఆశలను, ఆకాంక్ష లను దీర్చువేళ... వెర్రి వేషము లు, వెకిలిచేష్టల తలపులు నా కేల కలుగవలె !
నటనా వాసనలనుండి విడివడలేకనేనా... కాకున్న నేనా మహాపురుషుడు స్వామి వివేకానందుని వేషమును వేసుకోనుటేమి !
మహిళ వలే చీరనుకట్టి పూజలుచేయుటేమి !!పాన్పు క్రింద శయనించు టేమి., ఇస్సీ
ఇవి నే నెటుల జేసితిని !?
విధి నాచే ఇట్లాడించినదా ?!
... సేవలుచేసినపడతికి,ప్రత్యు
పకార మింకేదేనిచేయక,పెండ్లి
చేసుకుని... తప్పుజేసితినా !
ఐనదేదోఐనదని,ఆమెనింట
నుంచక,పాలనా వ్యవహార ముల వెంటడిప్పుటయే...ఈ
దుస్థితికి కారణమైనదా ?!
నిజమే... ఇది నేనుచేసిన పెద్ద పొరపాటే, గాకున్న ఒకరా
ఇద్దరా నాకు పాదాభివంద నములు చేసి దేవుడనని పూజించిన అనుచరులందరూ మూకుమ్మడిగా ఒక్కటై నన్ను తృణీకరించుటయా... !?
నిస్సందేహముగ...ఇది నా
తప్పిదమే !
మహోన్నతమైననానటజీవితముకన్న, నా ఈ రాజకీయ జీవితమే భావితరాలకు గొప్ప పాఠము కాగలదు !
ఆహా... !ఇంతఅవమానమును
పొందిననెను... ప్రాణమున్ననూ
లేనివాడనే !
*******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి