*పరోపకార పద్ధతి*
చంపకమాల:
*అతనికి వార్ధికుల్యయగు, నగ్ని జలం బగు, మేరుశైల మం*
*చితశిలలీల నుండు, మద సింహము జింక తెరంగుఁ దాల్చుఁ, గో*
*పితఫణి పూలదండ యగు, భీష్మవిషంబు సుధారసం బగున్*
*క్షితి జనసమ్మతం బగును శీల మదెవ్వనియందు శోభిలును.*
*తా:*
ఈ భూమి మీద వున్న అందరూ మెచ్చుకునేటట్టు ఎవరు ప్రవర్తిస్తారో వారికి, ఎంతో పెద్దగా వుండే సముద్రము చిన్న కాలువగా అవుతుంది. నిప్పు, నీరు అవుతుంది. ఎతగతైన పర్వతం కూడా చిన్న రాయి లాగా అవుతుంది. క్రూరమైన సింహము, జింక లాగా అవుతుంది. కోడె త్రాచు కూడా పూలదండ అవుతుంది. కాలకూట విషం కూడా తీయని పాయసం అవుతుంది........... అని *"ఏనుగు లక్ష్మణకవి"* చెపుతున్నారు.
*భావం:*
*"నిశ్చలమైన ప్రయత్నం తో అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలరు " అనేది పెద్దలు చెప్పే మాట. అలా అంతటి నిశ్చల చిత్తము తో పరమశివుని మీద నమ్మకంగా వున్నాడు కనుకనే మార్కండేయుడు కాలుని కూడా నిలువరించి చిరాయువు కాగలిగాడు. ధృవ కుమారుడు తనకు ఎదురైన కష్టాలను లెక్క చేయకుండా తల్లితండ్రుల సేవ మీద నుండి మనసును చెదరకుండా వుంచి, నక్షత్రముగా ప్రతీ నిత్యమూ ఈ భూమిపైని జీవరాసులకు వెలుగులు పంచుతూ, మార్గ దర్శనం చేస్తున్నాడు. ఇవి చాలు కదా, మనవి పుక్కిటి పురాణాలు కాదు, జీవన గమ్యాన్ని నిర్దేశించగల సజీవ చిత్రాలు అని చెప్పడానికి. ఇంతటి నిశ్చలత్వాన్ని సొంతం చేసుకుని మనము గూడా వుండేటట్లు పరాత్పరిని అనుగ్రహించమని వేడుకుంటూ ....... .*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి