*దైవ పద్ధతి*
మత్తేభము:
*ధర ఖర్వాటుఁడొకండు సూర్యకరసంతప్త ప్రధానాంగుఁడై*
*త్వరతోడన్ బరువెత్తి చేరి నిలిచెన్ దాళద్రుమచ్ఛాయఁ,ద*
*చ్ఛిరముం దత్ఫలపాతవేగమున విచ్చెన్ శబ్దయోగంబుగాఁ,*
*బొరి దైవోపహతుండు వోవుకడకుం బోవుంగదా యాపదల్.*
*తా:*
బట్టతల వాడు ఒకడు ఎండ వేడిని తట్టుకోలేక చెట్టు నీడ కోసం ఒక తాటి చెట్టు కిందకు వెళ్ళి నిలబడతాడు. ఆ తాటి చెట్టు నుండి ఇక తాటి పండు రాలి పడి అతని తల ముక్కలు అయిపోయింది. దేవుని బలము లేనివాడు ఎక్కడికి వెళ్ళినా వచ్చే బాధను ఎవరూ తప్పించలేరు........ అని *"ఏనుగు లక్ష్మణకవి"* చెపుతున్నారు.
*భావం:*
*మహాభారతం - కర్ణుడు. ఎలాగైనా ఎంత కష్టం పడైనా సరే అర్జునుని అధిగమించాలి అనుకుంటాడు. కానీ, అన్ని విధాల శాపోపహతుడై, కురుక్షేత్ర యుద్ధంలో అదే అర్జునుని బాణానికి బలి అవుతాడు. ఇక్కడ అర్జునునకు వున్నది, కర్ణునికి లేనిది ఒక్కటే "దైవబలము". పరామాత్ముడు అనుకూలించక లయకారకుడు శివుడు కూడా శని దేవుని ప్రభావము నుండి తప్పించుకోవడానికి చెట్టు తొర్రలో దాక్కుంటాడు. పరమేశ్వర కృప లేకపోవడం కాకపోతే, లయకారకుడు తొర్రలో దాక్కోవడం ఏమిటి? చెప్పండి. అందువలన, ఆ ఆది శంకరుని కృప, దయ, అనుగ్రహం మనకందరకు ఎల్లప్పుడూ ఇబ్బడి ముబ్బడిగా వుండాలని ప్రార్థిస్తూ....... .*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి