"ఉమ్మడికుటుంబప్రాధాన్యం-పద్యాంజలి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--చరవాణి:- 6300474467
 01.
కం.
ఉమ్మడికుటుంబమన్నది
సమ్మతముగసాగిపోవుసరియగురీతిన్
కమ్మనిమమతలనిలయము
నిమ్మహిస్వర్గమ్ముగాదెయేకాలమునన్!!!

02.
కం.
సమభావననేర్పించియు
సమతనుపెంపొందజేసిసఖ్యతగూర్చున్
శ్రమతత్త్వపుసంపదలిల
క్రమపద్ధతిలోనొసంగుకమనీయముగన్!!!



కామెంట్‌లు