బంధం;పి. చైతన్య భారతి, 7013264464
 నానీలు 
========
1.
స్నేహితుడే కదాయని 
మనువడితే 
మగబుద్దికి 
కొమ్ములొచ్చాయి. 
2.
నేటి వివాహ 
వృక్షానికి పండ్లేవి?
ప్రేమ ఆప్యాయతల 
సారం లేదుగా!
3.
పెళ్లినాడు 
మూడు ముళ్ళు 
గట్టిగా వేయలేదేమో !
అప్పుడే పెటాకులయ్యింది.
4.
అమ్మతో బంధం 
రాయాలని తపించా. 
కలం, కాగితం 
సరిపోలేదు. 
5.
కరోనా వచ్చాకే 
విలువ తెలిసింది. 
బంధమంటే ఏంటో. 
కడచూపు లేక. 
6.
మదిలో అమావాస్య 
అలుముకుందా ?
పున్నమి ఉందని 
మరువకు 
7.
చూపుల మంత్రం 
మాటల తంత్రం. 
బంధమై నిలిచింది. 
ప్రేమ మహిమ. 
8.
సంసార వీణలో 
ప్రేమ తంత్రులు 
మూగవోయాయి.
అనుమానం పురుగుతో. 
9.
ప్రేమలు
సమాధులవుతున్నాయి.
పరువుల కోసం 
ప్రాణాలు బలి. 
10. 
అమ్మ కావాలంటే 
కడుపునే పుట్టాలా ?
అనాథలకు 
అమ్మతనం చూపొచ్చు. 

కామెంట్‌లు