*విష్ణువు యొక్క నాభి కమలము అందులో నుండి బ్రహ్మ పుట్టడం - బ్రహ్మ తపస్సు చేయడం - బ్రహ్మ, విష్ణువు ల మధ్య అగ్ని స్థంబము రావడం - ప్రణమిల్లడము*
*తన తండ్రిని తెలుసుకోవాలి అని బ్రహ్మ చేసిన తపస్సు కు మెచ్చి, విష్ణు దేవుడు ప్రత్యక్షమౌతాడు. తన నాలుగు చేతులలో శంఖము, చక్రము, గదా, పద్మము లతో, బంగారు రంగులో వున్న ధృడమైన శరీరంతో, పట్టు బట్టలు కట్టుకుని ధగ ధగా వెలిగి పోతున్నాడు ఆ పరమపురుషుడు. తల మీద కిరీటము, మిగిలిన ఆభరణములను ధరించిన స్వామి, ఎంతో అందంగా వున్నాడు. విష్ణువు వంద మంది మన్మధుల అందాన్ని సొంతము చేసుకున్నాడు. ఇంత అందమైన రూపాన్ని సొంతం చేసుకున్న విష్ణు దేవుణ్ణి చూసి బ్రహ్మ, ఆశ్చర్యానికి గురి అవుతాడు. ఆసమయంలో, సకల తత్వములు రూపముగా కలవాడు, అంతటా వ్యాపించి వున్నవాడు, అన్ని ఆత్మలలో వున్నవాడు, నాలుగు భుజములు కలవాడు మహాబాహుడు అయిన నారాయణుడు తనతో వున్నందువల్ల బ్రహ్మ చాలా ఆనందాన్ని పొందుతాడు.*
*ఆ విధంగా, బ్రహ్మ, నారాయణులు ఒకరిని ఒకరు చూసుకుంటూ, కొంత సమయం తరువాత మాట్లాడుకుంటూ ఒకరిని ఒకరు తెలుసుకుంటారు. వారు ఇద్దరూ మాటలలో వున్నప్పుడు, వారి మధ్య నుండి అత్యంత కాంతితో వెలగులు జిమ్ముతూ అగ్ని స్థంబము వంటి "జ్యోతిర్మయ లింగం" వెలువడింది. అనుకోని విధంగా తమ మధ్యలో వచ్చిన ఈ నిరామయ, నిర్వికార రూపానికి మొదలు చివర చూడాలి అనుకున్నారు. ముందుగా బ్రహ్మ క్రిందకు వెళ్ళి మొదలు చూద్దాము అనుకున్నాడు. అలాగే, విష్ణువు తల చూద్దాము అని బయలు దేరాడు. కానీ, అగ్ని స్థంబము గా వెలసిన ఆ జ్యోతిర్మయ లింగం యొక్క మొదలు తుది వారిరువురూ కనుక్కో లేక పోయారు. ఇద్దరూ కూడా శివ మాయలో పూర్తిగా మునిగి వున్నారు. ఆ కనబడుతున్న వస్తువు ఏమిటి అని తెలుసుకో లేక పోయారు. ఆ వస్తువు రూపము, లక్షణము, ఇది అని నిర్ణయించడం వారి వల్ల కాలేదు.*
*ఇక ఏమీ చేయలేక, బ్రహ్మ, విష్ణువు లు ఇద్దరూ, ఆ అగ్ని స్థంబము ఎదురుగా నిలబడి, "స్వామీ! మీరు ఎవరు. మేము శివ మాయా మోహితులము అవడం వల్ల తెలుసుకో లేక పోతున్నాము. మీరు ఎవరైనా మీకు మేము అనేక నమస్కారాలు చేస్తున్నాము. సదాశివా! మీరు మాకు మీ నిజస్వరూపాన్ని చూపించి అనుగ్రహించాలని " ప్రార్ధించారు.
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి