*బ్రహ్మ విష్ణువు లకు సదాశివుని యొక్క శబ్దమయ శరీర దర్శనభాగ్యము కలుగుట*
*ఈ అగ్ని స్థంబము కిందనున్న కపాలభాగము అయిదు లక్షణములతో వున్నది. ఆ అండము నుండి చతుర్ముఖ బ్రహ్మ వెలువడ్డాడు. ఈయనే సమస్త లోకములను సృష్టి చేసాడు. భగవంతుడు అగు మహేశ్వరుడే "అ", " ఉ", "మ్" అనే మూడు వివిధ రూపాలుగా వర్ణించబడ్డాడు. ఈ విధంగా సదాశివుడగు శివుని తెలుసుకున్న విష్ణువు, శక్తివంతమైన, మహత్తర మైన మంత్రముల ద్వారా చక్కగా అలంకరిచుకుని వున్న ఆ మహేశ్వరుని స్తుతి చేసాడు. అంతలో, విష్ణు భగవానుని ముందు అయిదు ముఖాలతో, పది భుజములతో, గౌరవర్ణము లో వెలిగిపోతూ, సర్వాభరణ భూషితమై, అనేక విధములైన శోభలతో వెలిగి పోతున్న రూపము కనిపించింది. ఈ రూపము ఎంతో ఉదారమూ, గొప్ప పరాక్రమము కలిగినది, సర్వ లక్షణ సమన్వితముగా వున్నది. అంతటి ఉత్కృష్ట రూపమును చూచిన బ్రహ్మ విష్ణువు తాము కృతార్ధలము అయినట్టుగా అనుకున్నారు.*
*విష్ణువు చేసిన కీర్తనలకు సంతోషపడిన పరమశివుడు చిరుమందహాసము చిందిస్తూ తన దివ్యరూపముతో దర్శనము ఇస్తాడు. అ కారము ఆ స్వామి మస్తకము, ఆ కారము లలాటము, ఇ కారము కుడి నేత్రము, ఈ కారము ఎడమ నేత్రము, ఉ కారము కుడి చెవి, ఊ కారము ఎడమ చెవి. ఋ కారము పరమేశ్వరుని కుడి కపోలము, రూ కారము ఎడమ కపోలము. లు, లూ లు స్వామి నాసికలు. ఎ కారము సర్వవ్యాపకుడైన ఆ ప్రభువు యొక్క ఓష్టము. ఐ కారము అధరము. ఓ, ఔ లు పై, క్రింది దంత వరుసలు. అం, అః లు శూల ధారి అయిన పరమేశ్వరుని యొక్క రెండు తాలువులు. క వర్గము స్వామి యొక్క కుడి అయిదు చేతులు. చ వర్గమ స్వామి ఎడమ అయిదు చేతులు. ట, త వర్గములు స్వామి పాదములు. ప కారము కడుపు భాగము,
ఫ కారము కుడి వైపు భాగము, బ కారము ఎడమ వైపు భాగము. భ కారము భుజము, మ కారము యోగయోగి అగు సదాశివుని హృదయము. య నుండి స వరకు గల ఏడు అక్షరములు సర్వ వ్యాపి యగు శివుని యొక్క ఏడు ధాతువులు. హ కారము ఆ తండ్రి యొక్క నాభి. క్ష కారము మేఢ్రము గా చెప్పబడినది.*
*ఈ విధముగా నిర్గుణ మరియు సగుణ రూపమైన పరమేశ్వరుని యొక్క శబ్దరూపమును భగవతి ఉమా సహితముగా చూసిన విష్ణువు, బ్రహ్మ ఇద్దరూ కృతార్ధులైరి.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి