తెలంగాణ వికాసం;- డాక్టర్ విజయలక్ష్మి (పున్న) హైదరాబాద్.చరవాణి.9182741217.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ….
=======================

ఇంకా తెలవారదేమి
ఈ చీకటి వీడదేమి…

గుండెల నిండా నిండిన సంతోషం
గుబాలించేందుకు  సిద్ధం…
తూర్పున భానూదయ కిరణాలే
వసుంధ తటాక కమలాలపై
లేలేత కిరణాలు వెదజల్లుటకే సిద్ధం…
                       // ఇంకా తెలవారదేమి//
ముద్దుగుమ్మలు అంతా ముంగిట
అంగ రంగ రంగ వల్లుల వేయుటకేసిద్ధం
ఎన్నాళ్లో వేచిన హృదయం
ఈనాడే సేద తీరుట కే సిద్ధం
                    //ఇంకా తెలవారదేమి//
అసువులు బాసిన యువ రక్తమే 
వీర మరణం పొందిన భావిత కనుల ముందే కనిపించే దృశ్యం సిద్ధం….
నిరంకుశ  నవాబు పాలనకే
బూజు పట్టించిన జ్ఞాపకాలే సిద్ధం…
                //ఇంకా తెలవారదేమి//
అనచివేతకు అడ్డుకట్ట వేసి 
గులాం గిరీకీ  గుడ్బై చెప్పేందుకు సిద్ధం
ఉపాధి  చూపి సంక్షేమ పథకాలతో ముందుకు పోయే …
సస్యశ్యామలం చేసే కాళేశ్వర
 జలకళతో సిద్ధం…
             //ఇంకా తెలవారదేమి//
ఆసియానంతటికి కొలమానమే
మన హైటెక్ సిటీ…..
మెరుపు వేగంగా చేరేందుకే మన మెట్రో ట్రైన్ సిద్ధం….// ఇంకా తెలవారదేమి//
కోటి ఆశలతో కొంగుబంగారం కాగా
కోటి రతనాలనాల వీణ నా తెలంగాణ
నీ బిడ్డల ఆశలు నెరవేర్చు నా 
వీర తెలంగాణ వికాసం   సిద్ధం…
          //ఇంకా తెలవారదేమి//




కామెంట్‌లు