ఎవరు గొప్ప.....!!??;-రసస్రవంతి & కావ్యసుధ 9247313488 జంట కవులు : హైదరాబాద్
 భగవంతుడా ! మానవుడు
నిన్ను హస్తగతం చేసుకున్నాడు
భక్తి పేరుతో ముక్తి పేరుతో
మానవుని చేతిలో
బంధింపబడ్డావు
కాదంటావా?!
మానవుడు నిర్ణయించిన ప్రకారం
నీ నిత్య పూజలు
ఉదయం మేలుకొలుపు
అర్చనలు ఆరాధనలు
మధ్యాహ్నం నైవేద్యం
ఆపై కొంతసేపు విశ్రాంతి
తిరిగి సాయంత్రం మళ్లీ పూజ
అర్చన ఆరాధన నివేదన
రాత్రి తొమ్మిది దాటిన తర్వాత                                
 పవళింపు సేవ...
మరి మానవుని చేతిలో
నీవు కీలుబొమ్మ కాదా?
అంతా మానవ నిర్ణయం                                                                                             
ప్రకారమే నీవు నడుచుకోవాలి
నడుచుకుంటున్నావు కూడా 
మరి కనబడని నీవు గొప్ప
కనిపించే మేము గొప్ప...!!
నీ సేవల పేరుతో
కోట్లాది జనులు బ్రతుకుతున్నారు
నీకు శఠగోపం పెడుతున్నారు.
నీ పూజలకు రుసుము పెట్టి
కోట్లు గడిస్తున్నారు
ఆలయాలను నడుపుతున్నారు
నీ పేర వ్యర్దులు బ్రతుకుతున్నారు
వ్యాపారులు బ్రతుకుతున్నారు
నిరుపేదలు బ్రతుకుతున్నారు
నిత్య దరిద్రులు బ్రతుకుతున్నారు
భక్తితో నిన్ను వశపరచుకున్నారు
నీవిప్పుడు మానవుని చేతిలో                                                         
బందీవి  కాదంటావా....
అయినా నీలో నిశ్చలత్వం
నిలకడగా ఉంది                                                          
మానవులలో చంచలత్వఓ
తాండవం చేస్తోంది                                                          
నీకు మాకు మధ్య ఉన్నా తేడా
నీవు సూత్రధారివి !
మేము పాత్రధారులం !!
గెలుపు నీదే...... భగవాన్ !!

కామెంట్‌లు