దత్తపదులు;-మమత ఐలకరీంనగర్9247593432
 ఇంద్ర.. భీష్మ.. విష్ణు.. బ్రహ్మ
ఆ.వె
*ఇంద్ర* వైభవంబు నింటిలో నుండగా
*భీష్మ* ప్రతిన బూని భీకరమున
*విష్ణు* మాయవల్ల వేసారి పోవుచు
*బ్రహ్మ* రాతిదియను పలుకులేల
          2
దత్తపది:- ఇంద్ర....భీష్మ....విష్ణు.. బ్రహ్మ
తే.గీ
*ఇంద్రు* డు ప్రతిఫల వరంబు నిచ్చెగాన
*భీష్మ* మనుమని పుత్రుని వేగిరమున
*విష్ణు* వంసతో నున్నట్టి కృష్ణునెదుట
కూల్చె *బ్రహ్మా*ండ ముగకర్ణ గుట్టవోలె

కామెంట్‌లు